నోట్ల మార్పిడి బంద్‌… త్వ‌ర‌లో మ‌రో సంచ‌ల‌నం

untitled-1-copy

నోట్ల మార్పిడి కోసం ఇచ్చిన గ‌డువును ప్ర‌భుత్వం స‌మీక్షించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లో పూర్తిగా మార్పిడి కార్య‌క్ర‌మాన్ని నిలిపివేసే నిర్ణ‌యాన్ని తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ నెల 24వ తేదీ లేకుంటే అంత‌కంటే ముందుగానే వ్య‌క్తిగ‌తంగా నోట్ల మార్పిడిని నిలిపివేస్తార‌ని ఉన్న‌త‌స్థాయిలో ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి డిసెంబ‌రు 30 వ‌ర‌కూ ర‌ద్దు చేసిన నోట్ల‌ను మార్చుకునే వెసులుబాటు ఉంది. అయితే, తొలుత ఈ మార్పిడి ప‌రిధిని నాలుగు వేలుగా నిర్ధారించారు. ఆ త‌ర్వాత మ‌రో ఐదొంద‌లు పెంచారు. రెండు రోజులు గ‌డిచిన త‌ర్వాత అనూహ్యంగా నాలుగున్న‌ర వేల‌ను రెండు వేల‌కు కుదించారు.

ఇప్పుడు ఏకంగా అస‌లు మార్పిడి అనే ప‌ద్ధ‌తికే స్వ‌స్తి ప‌ల‌కాల‌ని మోడీ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. నోట్ల మార్పిడి తీసేస్తే.. ఇక‌పై పాత నోట్ల‌ను విధిగా బ్యాంకు ఖాతాల్లోనే జ‌మ చేయాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత ఏటీఎంలు, చెక్ బుక్స్ ద్వారా వాటిని ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లోని కొన్ని బ్యాంకులు త‌మ వ‌ద్ద‌కు వ‌స్తున్న వినియోగ‌దారుల‌ను డ‌బ్బును ఖాతాల్లోనే జ‌మ చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాయి. వీట‌న్నింటిని బ‌ట్టి అతి త్వ‌ర‌లోనే నోట్ల మార్పిడి ర‌ద్దు చేసే దిశ‌గా కేంద్రం క‌దుతుంద‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Loading...

Leave a Reply

*