అందుకే ఓడిపోయా: చ‌ంద్ర‌బాబు

chandra-babu

గ‌తంలో రాష్ట్రాన్ని ప‌రిపాలించిన స‌మ‌యంలో తాను ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌య్యాన‌ని చంద్ర‌బాబు ఒప్పుకున్నారు. తాను నేల విడిచి సాము చేయ‌డం వ‌ల్ల‌నే ఆ రోజు అధికారానికి దూర‌మ‌య్యాన‌ని ఆయ‌న ప‌రోక్షంగా చెప్పుకొచ్చారు. అప్ప‌ట్లో సీఎంగా ఉన్న తాను ప్ర‌జ‌ల కోసం ఎన్నో సంక్షేమ కార్య‌క్రమాలు చేప‌ట్టిన తాను అవి వాటంత‌ట అవే ప్ర‌జ‌ల‌కు చేరుతాయ‌ని భావించాన‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. అయితే, ప్ర‌భుత్వం అమ‌లు చేసిన కార్య‌క్ర‌మాలు క్షేత్ర స్థాయిలో ప్ర‌జ‌ల‌కు చేర‌లేద‌న్న విష‌యం ఎన్నిక‌ల‌లో ఓడిపోయిన త‌ర్వాత కానీ అర్థం కాలేద‌ని అన్నారు.

అందుకే ఈ సారి ప్ర‌భుత్వం పెడుతున్న ప‌థ‌కాల‌న్ని ప్ర‌జ‌లకు చేరేందుకు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామ‌ని అలాగే, నిరంత‌రం ప‌రిశీల‌న చేస్తున్నామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. అయితే, ఎంత సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించిన ప్ర‌భుత్వ ప‌థ‌కాల ఫలాలు పార్టీకి మేలు చేయాలంటే ఎమ్మెల్యేలే కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని చంద్ర‌బాబు సూచించారు. అందుకే వారికి మాత్ర‌మే ప్ర‌త్యేక అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. ఇది ప్ర‌త్యేక శిక్ష‌ణ అనే కంటే…. ప‌ర‌స్ప‌రం అభిప్రాయాల‌ను పంచుకునే వేదిక కావాల‌న్న‌ది త‌న ఉద్దేశ‌మ‌ని చంద్ర‌బాబు తెలిపారు.

Loading...

Leave a Reply

*