జ‌య‌ల‌లిత‌పై కుట్ర జ‌రిగిందా?

jaya

పుర‌చ్చిత‌లైవి… విప్ల‌వ‌నాయ‌కి… త‌మిళ‌తంబీల అమ్మ‌… సీఎం జ‌య‌ల‌లిత ఇప్పుడు చెన్నై ఆస్ప‌త్రిలో అచేత‌నంగా ప‌డి ఉన్నారు… తీవ్ర అనా రోగ్యంతో ఉన్న ఆమె మూసిన క‌న్ను తెర‌వ‌ట్లేదు…. పెద‌వి విప్ప‌ట్లేదు… జ‌య‌ల‌లిత‌ను కాపాడ‌డానికి డాక్ట‌ర్లు శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు… ఇప్పుడు జ‌య‌ల‌లిత మంచాన ప‌డ‌డంతో త‌మిళ‌నాడులో పాల‌న స్తంభించిందంటూ ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి… జ‌య‌ల‌లిత అనారోగ్యాన్ని సాకుగా తీసుకుని కొంద‌రు కుట్ర‌లు ప‌న్నుతున్నారా? సీఎం పీఠాన్ని ద‌క్కించుకోవ‌డానికి పావులు క‌దుపుతున్నారా?… అంటే అవున‌నే అంటున్నాయి త‌మిళ‌నాడు రాజ‌కీయ‌వ‌ర్గాలు… జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ ఈ కుట్ర‌కు సూత్ర‌ధారి అని అన్నాడీఎంకే బ‌హిష్కృత ఎంపీ శ‌శిక‌ళ పుష్ప ఆరోపిస్తున్నారు…

జ‌య‌ల‌లిత అనారోగ్యంతో క‌ద‌ల‌లేక మెద‌ల‌లేక‌పోవ‌డంతో శ‌శిక‌ళ పెద్ద స్కెచ్ గీసింద‌ని పుష్ప చెబుతోంది… సీఎం కావాల‌నే ఆశ‌తో ఉన్న శ‌శిక‌ళ జ‌య‌ల‌లిత సంత‌కాన్ని ఫోర్జ‌రీ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంద‌ని పుష్ప చెబుతున్నారు… పుష్ప చెబుతున్నదాని ప్ర‌కారం జ‌య‌ల‌లిత ప్లేసులో తాను సీఎం కావ‌డానికి శ‌శిక‌ళ సీక్రెట్ ఆప‌రేష‌న్ చేప‌ట్టిందిట‌…. అన్నాడీఎంకే పార్టీని, ప్ర‌భుత్వాన్ని కైవ‌సం చేసుకునేందుకు శ‌శిక‌ళ, ఆమె కుటుంబ‌స‌భ్యులు భారీ కుట్ర ప‌న్నారుట‌…దీనికోసం జ‌య సంత‌కాన్ని శ‌శిక‌ళ‌ ఫోర్జ‌రీ చేసే అవ‌కాశం ఉందంటూ ఇప్ప‌టికే త‌మిళ‌నాడు ఇన్‌చార్జి గ‌వ‌ర్న‌ర్‌కు పుష్ప ఒక లేఖ పంపారు…

జ‌య‌ల‌లిత చుట్టూ ఉచ్చు బిగించిన శ‌శిక‌ళ‌, ఆమె కుటుంబ‌స‌భ్యులు ఓ ప‌థ‌కం ప్ర‌కారం ముందుకు సాగుతున్నార‌ని పుష్ప చెబుతున్నారు…జ‌య‌ల‌లిత‌కు అనారోగ్యం రావ‌డం, ఆమె ఆస్ప‌త్రి పాల‌వ‌డం ఇవ‌న్నీ శ‌శిక‌ళ కుట్ర‌లో భాగ‌మేనంటున్నారు పుష్ప‌….శ‌శిక‌ళ పాత్ర‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని పుష్ప డిమాండ్ చేశారు….శ‌శిక‌ళ‌ను, ఆమె కుటుంబ‌స‌భ్యుల‌ను అపోలో ఆస్ప‌త్రి నుంచి గెంటెయ్యాల‌న్నారు ఆమె..మ‌రోవైపు పుష్ప ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూరేలా త‌మిళ‌నాడులో ప‌రిణామాలు చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయి…

గ‌త ప‌దేళ్లుగా డీఎంకేకు మిత్ర‌ప‌క్షంగా ఉన్న కాంగ్రెస్‌…ఇప్పుడు అన్నాడీఎంకే వైపు అడుగులు వేస్తోంద‌ని స‌మాచారం…రాహుల్‌గాంధీ ఆస్ప‌త్రికి వ‌చ్చి జ‌య‌ను ప‌రామ‌ర్శించ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మంటున్నారు….మ‌రోవైపు జ‌య స్థానంలో పార్టీ ప‌గ్గాలు చేత‌పుచ్చుకునేందుకు శ‌శిక‌ళ సిద్ధం అవుతున్న‌ట్టు తెలుస్తోంది… రాబోయ ఉపఎన్నిక‌ల్లో తంజావూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె పోటీ చేయ‌నున్న‌ట్టు త‌మిళ‌నాడులో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. అన్నాడీఎంకేకు ఒక జాతీయ పార్టీ అండ అవ‌స‌ర‌మ‌ని భావించిన శ‌శిక‌ళ కాంగ్రెస్‌కు చేరువ‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం…రాహుల్ రాక వెన‌క శ‌శిక‌ళ స్కెచ్ ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు… జ‌య‌ల‌లిత చుట్టూ ఇలా కుట్ర‌లు జ‌రుగుతుండ‌డంతో అన్నాడీఎంకే అభిమానులు త‌ల్ల‌డిల్లిపోతున్నారు.

Loading...

Leave a Reply

*