మొత్తం ప్రాసెస్‌లో మోదీ చేసిన ఒకే ఒక్క త‌ప్పు.. అదే కొంప‌ముంచింది…!

untitled-17

నోట్లు ర‌ద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణ‌యాన్ని తొలి రోజునుంచి జ‌న‌మంతా హ‌ర్షాతిరేకాల‌తో ఆమోదం తెలుపుతున్నారు. కొంచెం క‌ష్ట‌మైనా భ‌రిస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు. అయితే, రోజు గ‌డిచే కొద్దీ జ‌నంలో మార్పు వ‌స్తుంది. రోజుల త‌ర‌బ‌డి బ్యాంకుల వ‌ద్ద ప‌డిగాపులు ప‌డాల్సి రావ‌డం… నాలుగు రోజులైనా ప‌రిస్థితిలో ఏ మాత్రం మార్పు క‌న‌బ‌డ‌క‌పోవ‌డంతో జ‌నం వైఖ‌రి మారిపోతుంది. క్ర‌మంగా మోడీపై ఆగ్ర‌హంగా అది మారుతోంది. రోజువారీ ఖ‌ర్చుల‌కు కూడా డ‌బ్బులు దొర‌క్క‌పోవ‌డం బ్యాంకు వ‌ద్ద రోజంతా వెయిట్ చేసి ఓ రెండు వేలు తెచ్చుకున్నా అది కూడా ఇప్పుడు త‌మ అవ‌స‌రాలు తీర్చ‌క‌పోవ‌డంతో మోడీపై జ‌నానికి రోజు రోజుకూ ఆగ్ర‌హం పెరుగుతోంది.

దీనికి ప్ర‌ధాన‌మైన కార‌ణం.. మోడీ చేసిన త‌ప్పు ఒక్క‌టే ఉన్న నోట్లు ర‌ద్దు చేసి రెండు వేల నోటు వ‌దిలిన మోడీ అంత‌కంటే చిన్న‌దైన 500 రూపాయ‌ల నోటు విడుద‌ల చేయ‌క‌పోవ‌డం. ఆ త‌ప్పు మూలంగానే మోడీ అప్ర‌తిష్ట మూట‌గ‌ట్టుకుంటున్నారు. ఇప్పుడు చ‌లామ‌ణిలో ఉన్న‌ది వంద నోట్లు, రెండు వేల నోట్లు. వంద నోట్లు చాలిన‌న్ని లేవు. పైగా ఒక రెండు వేల నోటు తీసుకెళ్లి ఏదైనా కొంటే దుకాణ‌దారు మిగిలిన చిల్ల‌రంతా వంద‌ల్లోనే ఇవ్వాలి.అన్ని వంద నోట్లు ఇప్పుడు ఎవ‌రి ద‌గ్గ‌రా అందుబాటులో లేవు. దాంతో రెండు వేల నోటు మార్చ‌డం అంటే ఆ మొత్తానికి ఏదైనా కొనుక్కోవ‌డ‌మే అవుతోంది.

దాంతో జ‌నంలో అస‌హ‌నం పెరిగిపోతుంది. రెండు మూడొంద‌ల‌తో పోయేదానికి రెండు వేలు వ‌దిలించుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. దీన్ని జ‌నం భ‌రించ‌లేక‌పోతున్నారు. ఇప్పుడా అస‌హ‌న‌మే… రాను రాను మోడీపై ఆగ్ర‌హంగా మారుతోంది. తొలుత రెండు వేల నోటు విడుద‌ల చేస్తున్నామ‌ని రెండు రోజుల్లో కొత్త ఐదొంద‌లు మార్కెట్‌లోకి వ‌స్తుంద‌ని మోడీ చెప్పారు. కానీ అది జ‌ర‌గ‌లేదు. దాంతో ధ‌నిక‌, పేద సంబంధం లేకుండా ప్ర‌తిఒక్క‌రూ రోజు గ‌డిపేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు.

Loading...

Leave a Reply

*