ఇప్పుడు త‌మిళ‌నాడులో ఆమె చ‌క్రం తిప్పుతోంది

jaya

పుర‌చ్చిత‌లైవి, విప్ల‌వ నాయ‌కి, రాజ‌కీయ ర‌ణ‌ధీరురాలు జ‌య‌లలిత‌… సింపుల్‌గా చెప్పాలంటే త‌మిళ‌నాడులో అమ్మ‌… త‌మిళ‌నాడుకు ఆమె మ‌కుటం లేని మ‌హారాణి… త‌మిళ‌నాడుకు అమ్మ అయిన జ‌య‌ల‌లిత ఇప్పుడు ఆస్ప‌త్రిలో ఉన్నారు… తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందు తున్నారు… లేవ‌లేని ప‌రిస్థితిలో ఉన్నారు…. ఆమె ఆరోగ్యం గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. అయినా త‌మిళ‌నాడులో ప‌రిపాల‌న మాత్రం ఆగ‌డం లేదు… దానికి కార‌ణం ఆమె….. అమ్మ ఆస్ప‌త్రి పాల‌యినా ఆమె త‌మిళ‌నాడులో పాల‌న కుంటుప‌డ‌కుండా చూస్తోంది… ఇంకా చెప్పాలంటే అమ్మ ఆబ్సెన్స్‌లో ఇప్పుడు ఆమె త‌మిళ‌నాడులో చ‌క్రం తిప్పుతోంది… ఆమె మ‌రెవ‌రో కాదు…

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి షీలా బాలకృష్ణ‌న్‌…. తీవ్ర అనారోగ్యంతో ఆస్ప‌త్రి పాలైన త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత లేవ‌లేని ప‌రిస్థితుల్లో ఉండ‌డంతో రాష్ట్రాన్ని న‌డిపించే బాధ్య‌త షీలా బాల‌కృష్ణ‌న్ తీసుకున్నారు…. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో ఉన్న‌తాధికారులు మాత్ర‌మే కాదు…. మంత్రులు కూడా ఆమె సూచ‌న‌లు పాటించాల్సిందే… ఆమె ఆదేశాల ప్ర‌కార‌మే వాళ్లు న‌డుచుకుంటున్నారు..2014లో రిటైరైన షీలా బాల‌కృష్ణ‌న్ శ‌క్తియుక్తుల‌పై అపార న‌మ్మ‌కం ఉండ‌డంతో ఆమెను త‌న స‌ల‌హాదారుగా జ‌య‌ల‌లిత నియ‌మించుకున్నారు… ఇప్పుడు జ‌య‌ల‌లిత అనారోగ్యంతో ఉండ‌డంతో ఆమె స్థానంలో ప‌రిపాల‌నా బాధ్య‌త‌ల‌ను షీలా బాల‌కృష్ణ‌న్ నిర్వ‌హిస్తున్నారు…

ప్ర‌స్తుతం షీలా బాల‌కృష్ణ‌న్ త‌మిళ‌నాడులో అత్యంత కీల‌కవ్య‌క్తిగా మారార‌ని, ఆమె స‌మ్మ‌తి లేకుండా ఏదీ జ‌ర‌గ‌డం లేద‌ని సీనియ‌ర్ అధికారులు చెబుతున్నారు. జ‌య‌ల‌లిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్ప‌త్రిలో ఆమె గ‌దికి స‌మీపంలోని మ‌రో గ‌దిలో షీలా బాలకృష్ణ‌న్ ఉంటున్నారు…ఆమె ప‌క్క‌గ‌దిలో జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ ఉంటోంది… జ‌య‌ల‌లిత‌కు అత్యంత స‌న్నిహితురాలైన షీలా బాల‌కృష్ణ‌న్ ఇప్పుడు త‌మిళ‌నాడులో చ‌క్రం తిప్పుతోంద‌ని, రాష్ట్రాన్ని స‌మ‌ర్థ‌వంతంగా న‌డిపిస్తోంద‌ని అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి.

Loading...

Leave a Reply

*