శ‌భాష్ మోదీ.. భార‌త్ మీ వెంటే..!

modi

ఉగ్ర‌వాదంపై భార‌త్ స‌మర భేరి మోగించింది. భార‌త ఆర్మీ రంగంలోకి దిగింది. నోటి మాట‌ల‌తో చెప్ప‌డాన్ని ప‌క్క‌న‌పెట్టి తుపాకుల‌తో గ‌ర్జించ‌డం మొద‌లు పెట్టింది. నేరుగా పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోకి చొచ్చుకుపోయిన‌ మ‌న సైన్యం ఉగ్ర‌వాద శిబిరాలే ల‌క్ష్యంగా గుళ్ల వ‌ర్ణం కురిపిస్తోంది. బుధ‌వారం అర్ధ‌రాత్రి అనూహ్యంగా క‌ద‌న రంగంలోకి దిగిన భార‌త ద‌ళాలు ఉగ్ర‌వాదుల భ‌ర‌తం ప‌ట్ట‌డం మొద‌లెట్టాయి. ఊహించిన ఈ దాడితో ఉగ్ర‌వాదులు బితావ‌హుల‌య్యారు. ప్రాణాల‌ర‌చేతిలో పెట్టుకుని పారిపోయే య‌త్నాలుచేశారు. మ‌న సైన్యం వారిని వెంటాడి వేటాడి ఖ‌తం చేస్తోంది.

ఇప్ప‌టికే దాదాపు 40 మంది ఉగ్ర‌వాదుల‌ను అంత‌మొందించిన‌ట్లు తెలుస్తోంది. అన‌ధికారికంగా అది వంద‌మందికి పైగానే ఉండే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ దాడులు మొద‌లు పెట్టిన‌ట్లు భార‌త ఆర్మీ అధికారికంగా వెల్ల‌డించింది. ఎంత‌మంది ఉగ్ర‌వాదుల‌ను అంత‌మొందించామ‌న్న‌ది ఇప్ప‌టికిప్పుడు స్ప‌ష్టం చెప్ప‌లేమ‌ని భారత ఆర్మీ ప్ర‌తినిధి మీడియాకు వెల్ల‌డించారు. నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోకి చొచ్చుకుపోయి బ‌ల‌గాలు మూడు కిలోమీట‌ర్ల మేర ఉన్న ఉగ్ర‌వాద శిబిరాల‌ను కూక‌టివేళ్ల‌తో పెకిలించే ప‌ని చేప‌ట్టాయి. అయితే, మోదీ సేన స‌ర్వం సిద్దం చేసుకునే స‌మ‌రానికి సై అంది.

మోదీ తీసుకున్న నిర్ణ‌యానికి భార‌త్ జేజేలు ప‌లుకుతోంది. మొన్న ప‌ఠాన్‌కోట్‌, నిన్న ఉరీ… ఇలా ఉగ్ర‌వాదుల‌ను భార‌త భూభాగంలోకి పంపుతూ.. పరోక్ష యుద్ధం చేస్తోంది పాకిస్తాన్. ఎన్ని సార్లు చెప్పినా, ఏ మార్గంలో చెప్పినా వారు విన‌లేదు. చివ‌రికి ఇరుగుపొరుగు అంటూ దాయాది కోసం స్నేహ‌హ‌స్తం చాస్తూ భార‌త ప్ర‌ధాని పాక్ భూభాగంలో అడుగు పెట్టారు. న‌వాజ్ ష‌రీష్ ఇంటి వివాహానికి అనుకోని అతిథిగా హాజ‌ర‌య్యారు. ఇవేవీ వారికి క‌నిపించ‌లేదు. భార‌త్ ల‌క్ష్యంగా అనేకసార్లు రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు చేసినా.. శాంతే మార్గంగా మ‌నం ఎలాంటి దాడి చెయ్య‌లేదు. ఉరీ ఘ‌ట‌న‌తో భార‌త్ నెత్తురు మండింది. దానికి ప్ర‌తీకార‌మే ఈ దాడులు. శ‌భాష్ మోదీ.. స‌రైన టైమ్‌లో స‌రైన నిర్ణ‌యం తీసుకున్నారు.. అందుకే భార‌త్ మీ వెంటే.. మీ వెనుకే..

 

Loading...

Leave a Reply

*