సాక్షి దెబ్బ‌కు దిగొచ్చిన లోకేష్‌

lokesh

దెబ్బ‌కు దెయ్యం దిగొస్తుందంటారు… మీడియా దెబ్బ‌కు రాజ‌కీయ నేత‌లు కూడా దిగి రావాల్సిందే…. అక్ష‌రం ఆయుధంగా మారితే లీడ‌ర్ల‌లో డ‌ర్ పుట్టాల్సిందే…. ఈసారి సాక్షి ప్ర‌యోగించిన అక్ష‌ర క్షిప‌ణుల‌కు టీడీపీ చిన‌బాబు లోకేష్‌కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిందిట‌… సాక్షి, దానితో పాటు దానికి అనుకూలంగా ఉండే మీడియా, సోష‌ల్ మీడియా చిన‌బాబుపై చిచ్చుబుడ్డిలా విరుచుకుప‌డ్డాయి… దీంతో లోకేష్ హ్యాండ్స‌ప్ అనాల్సి వ‌చ్చింది…గుంటూరులో జ‌రిగిన టీడీపీ శిక్ష‌ణా శిబిరాల్లో మొద‌టి రెండు రోజులు ఎగ‌నామం పెట్టి మూడొచ్చిన‌ట్టు మూడో రోజు దిగ‌బ‌డ్డ లోకేష్ పార్టీ నేత‌ల‌కు దుమ్ము దులిపేశాడు… సీనియ‌ర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు అంద‌రికి త‌లంటు పోసేశాడు.. చిన‌బాబు దెబ్బ‌కు పార్టీ నేత‌లు ప‌రేషాన్ అయిపోయారు. అయితే త‌న‌కు మంత్రి ప‌ద‌వి కూడా రాలేద‌నే కోపం ఉందేమో మ‌రింత ఘాటుగా నాటుగా హాటుగా వాయించేశాడు…

మ‌రీ ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం, హోం మినిస్ట‌ర్ నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌ను నిమ్మ‌కాయ‌ను పిండిన‌ట్టు పిండి పారేశాడు చిన‌బాబు…తన‌కంటే వ‌య‌సులో పెద్ద‌వాడైన చిన‌రాజ‌ప్ప‌ను లేచి నుంచోబెట్టి ప్ర‌శ్న‌లు అడిగి క‌డిగి పారేశాడు.. కాల‌ర్ ప‌ట్టుకుని కొట్ట‌డం ఒక్క‌టే త‌క్కువ‌…. నీ మంత్రి ప‌ద‌వి పీకి పారేస్తా అంటూ చినబాబు రెచ్చిపోవ‌డంతో చిన‌రాజ‌ప్ప ఏడుపు ముఖం పెట్టుకుని హీనంగా దీనంగా నుంచున్నాడు… త‌ర్వాత ఈ విష‌యం మీడియాకు తెలియ‌డంతో దుమ్ముదుమారం రేగింది… ఎల్లో మీడియా దీన్ని తొక్కిపెట్ట‌గా సాక్షితో పాటు మ‌రికొన్ని మీడియా సంస్థ‌లు దీన్ని భుజాన వేసుకుని ప్ర‌చారం చేశాయి…

దీంతో లోకేష్‌పై విమ‌ర్శ‌లు తీవ్ర‌స్థాయిలో వెల్లువెత్తాయి.. విమ‌ర్శ‌ల అస్త్రాలు విప‌రీతంగా గుచ్చుకోవడంతో లోకేష్ వెన‌క్కి త‌గ్గాడు… ఈ అంశంపై లోకేష్ వివ‌ర‌ణ ఇచ్చుకోవ‌డంతో పాటు దానికి సంబంధించిన వీడియో కూడా విడుద‌ల చేశారు. తాను చిన‌రాజ‌ప్ప‌ను అవ‌మానించ‌లేద‌ని నిరూపించ‌డానికి ఆ టేప్ విడుద‌ల చేశారు… చిన‌రాజ‌ప్ప‌కు తాను లెఫ్ట్‌రైట్ వాయిస్తున్న ఫొటోను కూడా ఫేస్‌బుక్ నుంచి తొలగించారు..సో సాక్షి దెబ్బ‌కు లోకేష్ దిగొచ్చాడ‌న్న మాట‌… ద‌టీజ్ మీడియా ప‌వ‌ర్‌.

Loading...

Leave a Reply

*