ఇక త్వ‌ర‌లో రూ.2000 నోట్లు..!

2000

ఓవైపు గ‌త కొంత‌కాలంగా చంద్ర‌బాబు స‌హా కొంత‌మంది మేధావులు, ఆర్థిక వేత్త‌లు రూ.500, రూ.1000 నోట్ల‌ను చ‌లామ‌ణిలోనుంచి తీసివేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. న‌ల్ల‌ధ‌నాన్ని, అవినీతిని నిర్మూలించాలంటే ఇదొక మంచి ఆధార‌మ‌ని విమ‌ర్శ‌కుల నుంచి వినిపిస్తున్న మాట‌. కానీ, ఆర్బీఐతోపాటు కేంద్ర‌ప్ర‌భుత్వం మాత్రం దీనికి భిన్నంగా ఆలోచిస్తోంది. అధిక విలువ‌గ‌ల నోట్ల‌ను పంపిణీ చెయ్య‌డానికే మొగ్గు చూపుతున్న‌ట్లు అర్ధం అవుతోంది.పెరుగుతున్న ధ‌ర‌ల‌ను దృష్టిలో పెట్టుకొని త్వ‌ర‌లోనే రూ.2000 నోట్ల‌ను అందుబాటులోకి తేవాల‌ని ఆర్బీఐ ఇప్ప‌టికే క‌స‌ర‌త్తులు షురూ చేసింద‌ట‌. ఇప్ప‌టికే మైసూర్‌లోని కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌లో ఈ నోట్ల ముద్ర‌ణ పూర్త‌యి క‌రెన్సీ చెస్ట్‌ల‌కు పంపిణీ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

ఒకవైపు దేశంలో నల్లధనం అరికట్టడానికి రూ. 500, రూ.1,000 నోట్లను రద్దు చేయాలని వివిధ వర్గాల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఆర్‌బీఐ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆర్‌బీఐ తాజా లెక్క‌ల‌ ప్రకారం మార్చి, 2016 నాటికి రూ.16,41,500 కోట్ల కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. ఇది గతేడాదితో పోలిస్తే 15 శాతం వృద్ధికి సమానం. ఇందులో రూ. 500, రూ. 1,000 నోట్లే 86.4 శాతం వరకు ఉన్నాయి.మన కరెన్సీ చరిత్ర చూస్తే ఇప్పటివరకు రూ. 10,000 నోటే అత్యధిక డినామినేషన్ నోటుగా రికార్డులకు ఎక్కింది. 1978లో నల్లధనం అరికట్టడానికి రూ.

10,000, రూ. 5,000, రూ. 1,000 నోట్లను నాటిప్రభుత్వం రద్దు చేసింది. 2000 సంవత్సరంలో తిరిగి రూ. 1,000 నోటును ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు తొలిసారిగా కొత్త డినామినేషన్ రూ. 2,000 నోటు ప్రవేశానికి రంగం సిద్ధమయ్యింది. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నా కరెన్సీ నోట్లకు డిమాండ్ పెరుగుతుండటంతో కొత్త నోట్ల ముద్రణ ఆర్‌బీఐకి తలకు మించిన భారంగా మారింది. రూ.1,000 నోటు ముద్రణకు రూ.3 వ్యయం అవుతోంది. ఇదే అతి తక్కువ ముద్రణా వ్యయం. వివిధ డినామినేషన్లతో కూడిన నోట్లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం సూచించడంతో ఆర్‌బీఐ ఆ దిశగా అడుగులు వేస్తోంది.

Loading...

Leave a Reply

*