ద‌ళితుల‌ను తొక్కేస్తున్న కేసీఆర్‌!

k-chandra-shekar-rao

తెలంగాణ సీఎం కేసీఆర్ ద‌ళితుల‌ను రాజ‌కీయంగా అణ‌గ‌దొక్కాల‌ని చూస్తున్నార‌ని టీడీపీ ఆరోపిస్తోంది. క‌ష్ట‌ప‌డి ఎదిగి పైకొచ్చిన అట్ట‌డుగు వ‌ర్గాల‌కు చెందిన రాజ‌కీయ నేత‌లే ల‌క్ష్యంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు కేసీఆర్ తెర తీసార‌ని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. విప‌క్షాల‌ను ఆయా పార్టీల నేత‌ల‌ను దెబ్బ‌తీయ‌డ‌మే ల‌క్ష్యంగా జిల్లాల పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. కేసీఆర్ రాజ‌కీయ స్వార్థంతో చేప‌ట్టిన విభ‌జ‌న రాజ్యాంగ ఉల్లంఘ‌న‌, చ‌ట్ట వ్య‌తిరేక‌మ‌ని మండిప‌డ్డారు. జిల్లాల ఏర్పాటులో భాగంగా… మండ‌లాలు, గ్రామాల‌ను అటుఇటూ మారుస్తుండడం వెనుక రాజ‌కీయాలు ఉన్నాయ‌ని, ఖమ్మం జిల్లాలో ఎస్సీలకు రిజర్వ్‌చేసిన (మధిర, సత్తుపల్లి)సెగ్మెంట్లలో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లు భట్టివిక్రమార్క, సండ్ర వెంకట వీరయ్యల్లో ఒకరికే అవకాశం ఉంటుందని రేవంత్ చెప్పారు.

రాజనర్సింహ, గీతారెడ్డిల‌లో ఒక‌రికి మెద‌క్ జిల్లాలో ఇదే పరిస్థితి త‌ప్ప‌ద‌ని ఆయ‌న చెప్పారు. మంత్రి లక్ష్మారెడ్డి కోసం జడ్చర్లలోని మిడ్జిల్‌ మండలాన్ని నాగర్‌కర్నూలుకు మార్చారని, ఈ మండలం మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉంటే జడ్చర్ల సెగ్మెంటు ఎస్సీలకు రిజర్వ్‌ అయ్యేదని రేవంత్ చెప్పారు. నియోజకవర్గాల డీలిమిటేషన ఇప్పుడున్న ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల ప్రాతిప‌దిక‌నే చేపట్టాలని రేవంత్ డిమాండ్‌ చేశారు. లేకుంటే ద‌ళిత‌, గిరిజ‌న నేత‌లు రాజ‌కీయాల‌కు దూరం కావాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని రేవంత్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

Loading...

Leave a Reply

*