నిజాంపేట వ‌ర‌ద క‌ష్టం తీర్చిన రేవంత్‌…?

revant

సోష‌ల్ మీడియాలో స‌ర్క్యులేట్ అవుతున్న ఓ పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. హైద‌రాబాద్ నిజాం పేట  దాదాపు నాలుగు రోజులు వ‌ర‌ద‌లోనే మునిగింది. అక్క‌డికి అధికారులు ప‌రుగులు పెట్టారు. భండారి లే అవుట్‌తోపాటు మ‌రికొన్ని లే అవుట్‌ల ప్ర‌జ‌లు.. నానా ఇబ్బందులు ప‌డ్డారు. వ‌ర్షానికి బ‌య‌ట‌కు రాలేక‌.. దాదాపు మూడు నాలుగు అడుగు నీళ్లు నిలిచిపోవ‌డంతో  అక్క‌డే ఉండిపోయారు. కొంత‌మంది ఖాళీలు చేసి ముంపును త‌గ్గించుకున్నారు. మ‌రికొంద‌రు ఉన్నఇంటిని ఖాళీ చెయ్య‌లేక‌.. వేరు దారిలేక అక్క‌డే మ‌కాం వేశారు.

అయితే, అక్కడ వరద నీటిని పరిశీలించటానికి mla లు, మినిస్టర్ లు, పెద్ద పెద్ద లీడర్ లు వచ్చి పోవటం తప్ప వాటిని ఎలా తొలిగించాలి అని ఒక్కరు కూడా ఆలోచించలేదట…..! కానీ రేవంత్ రెడ్డి 4,5 గంటలు అక్కడే తిరిగి ఎందుకు ఈ నీరు ఇక్కడ బ్లాక్ అయ్యింది అని చూస్తే అక్కడ శ్రీబాలాజీ గేటెడ్ కమ్యూనిటీ ప్రక్కన ఒకతను నాలాను ఆక్రమించి గోడ కట్టాడు….. వెంటనే ఆ నీళ్లలో రేవంత్ రెడ్డి దిగి jcb పిలిపించి ఆ గోడని కూల్చటంతో 3 అడుగుల మట్టం నీళ్లు తగ్గాయి…..! దీనితో అక్కడ ప్రజలు ఊపిరి పీల్చుకున్నార‌ట‌. నాలుగు రోజులుగా ప‌డిన క‌ష్టానికి రెండు గంట‌ల్లో రేవంత్ ప‌రిష్క‌రించాడ‌ని చెప్పుకుంటున్నారు.  ఆయ‌న‌ను ప్ర‌శంసల‌తో ముంచెత్తుతున్నారు.

ఇటు ప్ర‌భుత్వం కూడా స్పందించి భండారి లే అవుట్‌తోపాటు అక్క‌డి ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసి ఖాళీ చేయించింది. దీంతో, స‌మస్య చాలా వ‌ర‌కు ప‌రిష్కార‌మ‌యింది. ఇవాళ వ‌ర్షాలు కూడా త‌గ్గ‌డంతో నిజాంపేట వాసులు ఊపిరిపీల్చుకున్నారు. మ‌రో రెండు రోజులు వ‌ర్షం తెరిపిస్తే… అక్కడి జ‌న‌జీవ‌నం మళ్లీ సాధార‌ణ స్థాయికి చేరుకుంటుంది.

 

Loading...

Leave a Reply

*