రూ.93కే 10జీబీ 4జీ ఇంట‌ర్నెట్‌… జియో న‌యా ఆఫ‌ర్‌..!

untitled-21

రిల‌య‌న్స్ జియో ఈ సారి మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌కి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే డేటాగిరిని తీసుకువ‌స్తామంటూ ప్ర‌తిన పూనిన ముకేష్ అంబానీ.. జియోతో సంచ‌ల‌నం సృష్టించాడు. దీంతో, ఇత‌ర టెలికాం కంపెనీలు కూడా జియో బాట ప‌డుతున్నాయి. వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునే య‌త్నం చేస్తున్నాయి. దేశంలో టెలికాం విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు తెర‌తీసింది. మొబైల్ ఇంట‌ర్నెట్ రంగంతోపాటు బ్రాడ్ బ్యాండ్ విభాగంలోనూ సత్తా చాటేందుకు జియో రెడీ అయిన‌ట్లు స‌మాచారం.రాబోయే ఒక‌టి రెండు వారాల్లో జియో గిగా ఫైబ‌ర్ బ్రాండ్ బ్యాండ్ స‌ర్వీస్ 4జీ లాంచింగ్‌కి రెడీ అవుతోందని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఇది మ‌రో విప్ల‌వం సృష్టించ‌నుంద‌ని వారి మార్కెట్ నిపుణుల అభిప్రాయం.

జియో నెట్ వ‌ర్క్‌పై రిల‌య‌న్స్ అందిస్తోన్న వెల్‌క‌మ్ ఆఫ‌ర్‌లో భాగంగానే డిసెంబ‌ర్ 31, 2016 వ‌ర‌కు అన్ని జియో సేవ‌ల‌ను పొందే చాన్స్ ఉంది.ఆర్‌కామ్ సీడీఎమ్ే యూజ‌ర్‌ల కోసం రిల‌య‌న్స్ జియో ఇంట‌రెస్టింగ్ ఆఫ‌ర్‌ని లాంచ్ చేసింది. ఈ ఆఫ‌ర్‌లో భాగంగా ఆర్‌కామ్ సీడీఎమ్ఏ నుంచి జియో నెట్‌వ‌ర్క్‌లోకి మైగ్రేట్ అయ్యే యూజ‌ర్‌ల‌కు రూ.93కే 10జీబీ 4జీ డేటాను జియో అందిస్తోంది. కొన్ని సర్కిల్స్‌లో ఈ ఆఫ‌ర్ రూ.97కి అందుతుంది.రిల‌య‌న్స్ జియో సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత దాదాపు 80ల‌క్ష‌ల మంది అంటే దాదాపు 90 శాతం మంది ఆర్‌కామ్ నెట్‌వ‌ర్క్ యూజ‌ర్‌లు జియో 4జీ స‌ర్వీసులోకి మారిపోయిన‌ట్లు తెలుస్తోంది.

93 రూపాయ‌ల‌కే 10జీబీ 4 జీ డేటా అంటే మామూలు విష‌యం కాదు. అంటే, ఒక జీబీ డేటా కేవ‌లం 9 రూపాయ‌ల‌కే అన్న‌మాట‌. ఇది బంప‌ర్ ఆఫ‌ర్‌. వినియోగ‌దారుల‌ను ఎట్రాక్ట్ చెయ్య‌డానికే జియో ఇలాంటి ఆఫ‌ర్‌లు మ‌రికొన్ని ఇచ్చేందుకు రెడీ అవుతోందని స‌మాచారం. మ‌రో ఇంట‌రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. రిల‌య‌న్స్ జియో నేష‌న‌ల్ వైడ్ సీడీఎమ్ఏ స‌ర్వీస్‌ల‌ను కూడా ప్రారంభించేందుకు రెడీ అవుతుంద‌ని స‌మాచారం. ఇదే జ‌రిగితే.. దేశంలో టెలికాం విప్ల‌వంతోపాటు డేటా రివ‌ల్యూష‌న్ కూడా రానుంద‌ని మార్కెట్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

Loading...

Leave a Reply

*