భాగ్య‌న‌గ‌రితో తెగిన ఏపీ బంధం

amaravathi

ఆంధ్ర‌ప‌దేశ్‌కు హైద‌రాబాద్‌తో బంధం తెగిపోయింది. ఆరు ద‌శాబ్దాల పాటు హైద‌రాబాద్‌లోని స‌చివాల‌యంతో పెన‌వేసుకున్న అనుబంధం ఇక చ‌రిత్ర‌గానే మిగిలిపోనుంది. న‌వ్యాంధ్ర‌లో న‌వ శ‌కం ప్రారంభించేందుకు ఉద్యోగులంతా త‌ర‌లి వెళ్లిపోయారు. సోమ‌వారం(అక్టోబ‌రు 3) నుంచి వెల‌గ‌పూడిలో విధులు నిర్వ‌ర్తించేందుకు అంతా ఏపికి త‌ర‌లారు. తీవ్ర భావోద్వేగాల మ‌ధ్య ఆత్మీయ వీడ్కోలు సెల్ఫీలు తీసుకుని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉద్యోగులంతా నవ్యాంధ్ర‌కు త‌ర‌లి వెళ్లారు. ఇక‌, హైద‌రాబాద్‌తో ఏపీకి బంధం కేవ‌లం కాగితాల్లోనే… విభ‌జ‌న చ‌ట్టంలోని ఉమ్మ‌డి రాజ‌ధాని అన్న మాట‌ల‌కే ప‌రిమితం కానుంది.

న‌వంబ‌రు 1, 1956 నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌చివాల‌యంల హైద‌రాబాద్ కేంద్రంగా ప‌ని చేస్తుంది. అలా 60 ఏళ్లు, విభ‌జ‌న త‌ర్వాత ఉమ్మ‌డి రాజ‌ధాని హోదాలో మ‌రో 28 నెల‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ పాల‌న ఇక్క‌డి నుంచే న‌డిచింది. ఇక‌పై మాత్రం ఏవైనా ప్ర‌త్యేక‌మైన ప‌నులు, హైకోర్టులో ఏవైనా కేసులుంటే త‌ప్పించి ఏపీ ఉద్యోగులు, ప్ర‌జ‌లు ఇక్క‌డ‌కు రావాల్సిన ప‌ని ఉండ‌దు. ఇక‌, కేసులు చూసుకోవ‌డానికి కొంద‌రు ఉద్యోగులు మిన‌హా ఇంకెవ్వ‌రూ హైద‌రాబాద్‌లో ఉండ‌రు. అలాగే ప్ర‌స్త‌తుం ఏపీకి కేటాయించిన స‌చివాల‌య భ‌వ‌నాల‌ను కూడా అధికారికంగా ఖాళీ చేయ‌డం లేదు.

Loading...

Leave a Reply

*