అమెరికాలో బాబు ప్రచారం…!

untitled-5-3

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌లో డెమొక్రాట్ల గెలుపుకోసం ఏపీ సీఎం చంద్ర‌బాబు పాటుప‌డుతున్నార‌న్న‌ది తాజా క‌థ‌నం. హిల్ల‌రీ గెలిస్తే అమెరికా నుంచి అమ‌రావ‌తికి పెట్టుబ‌డులు వ‌ర‌ద‌లెత్తుతాయ‌న్న‌ది దానికి స‌మ‌ర్థ‌న. బాబుకు క్లింట‌న్ కుటుంబానికి స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌న్న‌ది దానికి లాజిక్‌. తెలుగు మీడియాలో ఇప్పుడు ఈ వార్త‌లే హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అమెరికాలోని తెలుగు ఓట‌ర్లంద‌రినీ గంప‌గుత్త‌గా హిల్ల‌రికే మ‌ద్ద‌తు ప‌లికేలా చంద్ర‌బాబు చ‌క్రం తిప్పార‌ని ఆ క‌థ‌నాల్లోని కీల‌క పాయింట్‌. గ‌తంలో తాను సీఎంగా ఉండ‌గా క్లింట‌న్‌ను హైద‌రాబాద్‌కు తీసుకొచ్చిన చంద్ర‌బాబు అప్ప‌టి నుంచి ఆయ‌న కుటుంబంతో సాన్నిహిత్యాన్ని కొన‌సాగిస్తున్నార‌ట‌.

ఆ బంధ‌మే ఇప్పుడు బాబును హిల్ల‌రి కోసం ప‌నిచేసేలా చేస్తుంద‌ట‌. అమెరికా ఎన్నిక‌ల‌లో భార‌తీయ ఓట‌ర్లే కీల‌క‌మ‌ని, అందులోనూ తెలుగువారు కూడా పెద్ద సంఖ్య‌లో ఉన్నార‌ని వీళ్లంతా హిల్ల‌రీకే మ‌ద్ద‌తు ప‌లుకుతున్నందున‌, అమెరికాలో కూడా ట్రంప్‌పై మోజు త‌గ్గిపోతున్నందున హిల్ల‌రీ గెలుపు ఖాయ‌మ‌ని బాబు ధీమా వ్య‌క్తం చేస్తున్నార‌ని స‌మాచారం. ఆ క్ర‌మంలోనే హిల్ల‌రీ గెలిచి అధ్య‌క్షురాలైతే…. ఆమె బాధ్య‌త‌ల స్వీకారానికి చంద్ర‌బాబుకు కూడా ఆహ్వానం ఖాయ‌మ‌ని, అలా అమెరికా వెళ్లే చంద్ర‌బాబు రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన పెట్టుబ‌డుల‌ను పెద్దెత్తున స‌మీక‌రించ‌డం ఖాయ‌మ‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయ‌ట‌. ఇదీ ఇప్పుడు తెలుగు మీడియాలో వ‌స్తున్న హాట్ టాపిక్‌.

Loading...

Leave a Reply

*