న‌వ్యాంధ్ర‌లో రియ‌ల్ ప‌రుగు!

untitled-121

క‌ట్టుబ‌ట్ట‌ల‌తో రోడ్డున ప‌డ్డ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు వేల కోట్ల వ్యాపారం జ‌రుగుతోంది. అమ‌రావ‌తి రాజ‌ధానిగా ప్ర‌క‌టించిన జంట జిల్లాలు కృష్ణా, విజ‌య‌వాడల్లో అయితే, వంద‌ల కోట్లు దాటి వేల కోట్ల రూపాయ‌లతో నిర్మాణ రంగం వర్థిల్లుతోంది. న‌వ్యాంధ్ర‌లో రియ‌ల్ ఎస్టేట్ విరాజిల్లుతోంది. రాష్ట్ర‌వ్యాప్తంగా నివాస స‌ముదాయాలు, వాణిజ్య స‌ముదాయాల నిర్మాణం జోరందుకుంది. ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కూ ఏపీలో రెండున్న‌ర వేల కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో భారీ ప్రాజెక్టుల‌కు రాష్ట్ర ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ అథార్టీ ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు ఇచ్చింది. అంటే ఈ రెండున్న‌ర‌వేల కోట్ల రూపాయ‌ల నిర్మాణ ప‌నులు అధికారికంగా జ‌రుగుతున్న‌ట్లే లెక్క‌.

ఇవి గాకుండా అనుమ‌తులు లేకుండా జ‌రిగే నిర్మాణాలు మ‌రికొన్ని ఎటూ ఉంటాయి. అంటే అటూ ఇటుగా మూడు వేల కోట్ల రూపాయ‌ల వ్య‌య‌మయ్యే ప్రాజెక్టులు నవ్యాంధ్ర‌లో వివిధ ద‌శ‌ల‌లో ఉన్న‌ట్లే. ఇక‌, వీటిలో అధిక శాతం అమ‌రావ‌తికి చుట్టుప‌క్క‌లే విస్త‌రిస్తుండడం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే అక్క‌డి ప‌చ్చ‌టి పంట పొలాల‌న్నీ ఆకాశ‌మెత్తు క‌ట్ట‌డాల‌తో రుపుమార్చుకుంటున్నాయి. ఒక్క గుంటూరు జిల్లాలోనే 1520 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులతో నిర్మాణాలు జోరుగా సాగుతున్న‌ట్లు అంచనా. ఇక కృష్ణా జిల్లాలో 360 కోట్ల రూపాయ‌ల ప్రాజెక్టులు వివిధ ద‌శ‌ల‌లో ఉన్నాయి. ఈ రెండు జిల్లాల త‌ర్వాత విశాఖ జిల్లాలో రియ‌ల్ రంగం ఊపుమీదుంది.

Loading...

Leave a Reply

*