మోదీ నిర్ణ‌యం వెనుక అస‌లు వ్య‌క్తి ఈయ‌నే…!

modi1

రూ. 500, 1000 రూపాయ‌ల నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాని మోదీ తీసుకున్న నిర్ణ‌యం వెనుక‌ అస‌లు కార‌ణం ఒక వ్య‌క్తి అని తెలిసింది. ఈ వ్య‌క్తి స‌ల‌హా ద్వారానే ప్ర‌ధాని మెదీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇంత‌కీ ఎవ‌రో తెలుసా..? ఆయ‌న పేరు అనిల్ బోకిల్‌. మ‌హారాష్ట్రలోని పుణేకి చెందిన ఆర్ధిక మేధావి. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా అవినీతిపై స‌మ‌ర‌భేరి మోగిస్తున్న ఈ ఎక‌నామిస్ట్‌.. ముఖ్యంగా కరెన్సీ ఏరివేత‌పై గురి పెట్టారు. ఎన్నిక‌ల‌కు ముందే మోదీని క‌లిసి ఆయ‌న ప‌లు సూచ‌న‌లు చేశార‌ట‌. వాటిని సావ‌ధానంగా విన్న మోదీ.. ఇన్నాళ్ల‌కు ఆయ‌న చేసిన సూచ‌న‌ల‌ను ముందుకు తెచ్చార‌ట‌. ఇంత‌కూ ఆయ‌న చేసిన సూచ‌న‌ల‌పై మ‌న‌మూ ఓ లుక్కేద్దాం..

బ్లాక్ మ‌నీని అరిక‌ట్ట‌డానికి పెద్ద నోట్ల‌ను బ్యాన్ చెయ్యట‌మే ఒక్క‌టే మార్గ‌మ‌ని మోదీకి సూచించార‌ట అనిల్ బోకిల్‌. ఇటీవ‌ల అనిల్ బొకిల్ మోదీని క‌లువ‌గా.. మొద‌ట 9 నిముషాలు మాత్ర‌మే టైమ్ ఇచ్చారట‌. కానీ, ఆయ‌న చేసిన సూచ‌న‌లు, ఆర్థిక స‌ల‌హాల‌పై మోదీ షాక్ అయ్యాడ‌ట. ఇత‌ర అపాయింట్‌మెంట్‌ల‌న్నింటినీ క్యాన్సిల్ చేసుకొని అనిల్‌తో రెండు గంట‌ల‌పాటు స‌మావేశ‌మ‌య్యాడ‌ట మోదీ. ఆ రెండు గంటల్లోనే మోదీకి ఓ ప‌క్కా క్లారిటీ వ‌చ్చేలా చేశాడ‌ట అనిల్‌. అంతే, ఇక‌పై ఏమాత్రం ఉపేక్షించ కూడ‌ద‌ని భావించిన ప్ర‌ధాన‌మంత్రి రాత్రికి రాత్రి స‌డెన్‌గా ప్ర‌క‌ట‌న చేశారు. కానీ, దీనికి సంబంధించిన స్కెచ్‌ను ముందుగానే రెడీ చేసుకున్నాడు మోదీ.

బోకిల్ చెప్పిన స‌జెష‌న్స్‌లో కొన్ని..

1. 100, 500, 1000 నోట్ల‌ను బ్యాన్ చెయ్యాలి
2. అన్ని లావాదేవీలు బ్యాంక్ ద్వారా చెక్,డిమాండ్ డ్రాప్ట్,ఆన్ లైన్ ద్వారానే జ‌ర‌గాలి.
3. ఆదాయం సేక‌ర‌ణ మొత్తానికి ఒకే బ్యాంకింగ్ వ్య‌వ‌స్ధ ఉండాలి..

బోకిల్ సూచ‌న‌లు చేయ‌డంతోపాటు వాటిపై విస్త్ర‌త‌మైన పరిశోధన చేశాడ‌ట‌. దీనిని గణాంకాల రూపంలో మోదీకి వివ‌రించ‌డంతో ఆయ‌న‌షాక్ అయ్యాడ‌ని స‌మాచారం.

అనిల్ చూపించిన గణాంకాలు ఇలా ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇండియాలో రోజు 2.7 ల‌క్ష‌కోట్లు రూపాయ‌ల లావాదేవీలు జ‌రుగుతున్నాయి. వీటిని కౌంట్ చేస్తే సంవ‌త్సారానికి 800 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల లావాదేవీలు జ‌రుగుతున్నాయి. 20 శాతం లావాదేవీలు మాత్ర‌మే బ్యాంక్స్ ద్వారా జ‌రుగుతున్నాయి. మిగ‌తావ‌న్ని అడ్డ‌దారిలో పోతున్నాయి. ఇండియాలో 78 శాతం జ‌నాభా రోజుకు 200 రూపాయ‌లు, అంత‌కంటే త‌క్కువ‌ మాత్ర‌మే ఖ‌ర్చు చేస్తున్నారు. అందువ‌ల్ల‌న వాళ్ల‌కి పెద్ద నోట్లు అవ‌స‌రం లేదని చెప్పాడ‌ట‌. మిగిలిన‌దంతా బ్లాక్ మ‌నీ కావ‌డంతో దానిని ఎలాగ‌యినా నియంత్రించాల‌ని, దానికి క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సూచించాడ‌ట అనిల్‌. అంతే, ఓ నిర్ణయానికి వ‌చ్చిన మోదీ.. ఆర్ధిక వేత్త‌ల‌తో
మాట్లాడి త‌గిన ప్రిప‌రేష‌న్స్ చేసుకొని బ్లాక్‌మ‌నీపై స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ చేశాడ‌ని చెబుతున్నారు నిపుణులు. ఏమ‌యినా, అనిల్ చేసిన స‌జెష‌న్స్ తీవ్ర ప్ర‌కంప‌న‌లు క్రియేట్ చేస్తున్నాయి. మ‌రి, అవి ఎలాంటి ఫ‌లితాల‌ను ఇస్తాయో చూడాలి.

Loading...

Leave a Reply

*