అమెరికా ఫస్ట్ లేడీ… ట్రంప్ భార్య‌.. ఆమె చ‌రిత్ర తెలుసా..? 

trump-a

ఈ ఫోటో చూస్తే ఏమ‌నిపిస్తోంది..? ఇంత హాట్ హాట్‌గా, స్పైసీగా ఉంది క‌దా.. ఓ మోడ‌ల్ అనుకుంటున్నారా..? అవును, మోడ‌లే కానీ, మాజీ మోడ‌ల్‌. ఇప్పుడు ఆమె రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఈవిడ‌ కాబోయే అమెరిక‌న్ ఫ‌స్ట్ లేడీ.. పేరు మెలానియా ట్రంప్‌. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో విజేత‌గా నిలిచిన ట్రంప్ మూడో భార్య‌. ప్ర‌స్తుతం అమెరికా ప్రెసిడెంట్ బ‌రాక్ ఒబామాలా కాబోయే అమెరికా ఫస్ట్ లేడీ.

ట్రంప్ విజ‌యంలో మెలానియా పాత్ర చాలా ఉంది. ఆమె ఎంతో కీ రోల్ పోషించింది. ఎన్నిక‌ల బ‌రిలో ట్రంప్‌పై ఎన్నో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆయ‌న స్త్రీ లోలుడు అని, అమ్మాయిలంటే చిన్న చూప‌ని.. ఇలా హిల్ల‌రీ క్యాంప్ ఆయ‌న‌పై చెయ్య‌ని ఆరోప‌ణ‌లు లేవు. అయినా, వాటిని స‌మర్ధ‌వంతంగా తిప్పికొట్ట‌డంతో ట్రంప్‌తోపాటు మెలానియా కూడా స‌మర్ధ‌వంత‌మైన రోల్ ప్లే చేసింది. అదే ట్రంప్‌కి క‌లిసొచ్చింది. ఇలా ఆయ‌న బెట‌ర్ హాఫ్‌గా నిలిచింది.

అలాంటి మెలానియా బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే.. ఆమె ట్రంప్‌కి మూడో భార్య‌. 1970లో జ‌న్మించింది. 16 ఏళ్ల‌కే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. అర్ధ‌న‌గ్న‌, నగ్న ఫోటోల‌తో అప్ప‌టి యూత్‌కి కిర్రాక్ పుట్టించింది. టాప్ మోడ‌ల్‌గా అవ‌త‌రించింది. నాటి ఫోటోల‌నే ఎన్నిక‌ల క్యాంపెయినింగ్‌లో హిల్ల‌రీ టీమ్ పోస్ట‌ర్స్‌పై ప్ర‌చురించి ఆమెను కూడా వివాదాల‌లోకి లాగారు. అయితే, ఇప్పుడు ఆమె విజ‌య ద‌ర‌హాసంలో అవన్నీ కొట్టుకుపోతున్నాయి. కానీ, మెలానియాలాంటి హాట్ అండ్ స్పైసీ లేడీ ఇంత‌వ‌ర‌కు అమెరికా అధ్య‌క్షుడి భార్య‌గా రాలేద‌ట‌. ఆ విష‌యంలో మెలానియాదే టాప్ ప్లేస్ అట. ట్రంప్-మెలానియా వివాహం 2005లో జ‌రిగింది. ఈ ప‌దేళ్ల‌లోనే ట్రంప్‌కి ల‌క్కీ లేడీగా బాగా క‌లిసి వ‌చ్చింద‌ట‌. ఏదిఏమ‌యినా మెలానియా కాబోయే అమెరికా ఫ‌స్ట్ లేడీ.

Loading...

Leave a Reply

*