క‌మ్మ‌రాజ్యానికి కాపు కాస్తున్న ప‌వ‌న్‌

rgv

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌… టాలీవుడ్‌లో నెంబ‌ర్ వ‌న్ హీరో… రీల్‌లోనే కాదు రియ‌ల్‌గా కూడా హీరోనే… గ‌త ఎన్నిక‌ల్లో పాలిటిక్స్‌లో త‌న ప‌వ‌ర్ చూపించాడు జ‌నసేనాని ప‌వ‌న్‌… చంద్ర‌బాబు విజ‌యానికి కారకుల్లో ప‌వ‌న్ కూడా ఒక‌డు…. అలాంటి ప‌వ‌న్‌పై ఇప్పుడు వ‌ర్మ సెటైర్లు వేస్తున్నాడు.. ప‌వ‌న్ అంటే త‌న‌కు అభిమాన‌మ‌ని చెప్పే రామ్‌గోపాల్ వ‌ర్మ ఇప్పుడు ప‌వ‌న్‌కి పంచ్‌లు ఇస్తున్నాడు.. క‌మ్మ రాజ్యానికి కాపు కాసే కాపు లీడ‌ర్ అంటూ ప‌వ‌న్‌ రిటైర్డ్ హ‌ర్ట్ అయ్యేలా వ‌ర్మ వ్యాఖ్యానాలు చేశాడు…. కాట‌మ‌రాయుడు షూటింగ్‌లో ప‌వ‌న్ బిజీగా ఉన్న టైమ్‌లో వ‌ర్మ చేసిన ట్వీట్లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి… క‌మ్మ‌గా కాపు కాసే శ‌క్తిగా మారి ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలుగు ప్ర‌జ‌ల‌కు అత్యున్న‌త నాయ‌కుడిగా మార‌తాడంటూ వ‌ర్మ చేసిన ట్వీట్లు క‌ల‌క‌లం రేపుతున్నాయి….

అయితే అదే ట్వీట్‌లో మ‌రో ట్విస్ట్ ఇచ్చాడు వ‌ర్మ‌…క‌మ్మ అంటే కాపు, క‌మ్మ కాద‌ని క‌మ్మ అంటే క‌మ్మ‌నైన‌, స్వీట్ అంటూ మ‌రో షాక్ ఇచ్చాడు… ఈ ట్వీట్ల‌తో త‌న ప‌దాల వెనుక అర్థాల‌కు సంబంధించి ర‌క‌ర‌కాల చ‌ర్చ‌ల‌కు వ‌ర్మ అవ‌కాశం ఇచ్చాడు… కులాల ప్ర‌స్తావ‌న తేవ‌ద్దు అంటూనే ఇన్‌డైరెక్ట‌ర్‌గా న‌రుక్కొచ్చాడు ఈ వివాదాస్పద వ‌ర్మ‌… డైరెక్ష‌న్ క‌న్నా యాక్ష‌న్ ఎక్కువచేసే ఈయ‌న ఇప్పుడు వంగ‌వీటి సినిమా తీస్తున్నాడు… ఆ సినిమాకు ప‌బ్లిసిటీ కోసం ఇలా చేశాడా… ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని ఇలా ఉప‌యోగించుకున్నాడా అని మ‌రికొంద‌రు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు….

అయితే వ‌ర్మ మాట‌ల‌కు అస‌లు అర్థాలు వేరులే అంటున్నారు పొలిటిక‌ల్‌, సినీ పండితులు… క‌మ్మ రాజ్యానికి కాపు కాస్తున్నాడంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై వ‌ర్మ నేరుగా సెటైర్లు వేశాడ‌ని, త‌న పంచ్‌ల‌తో ప‌వ‌న్‌కి పంక్చ‌ర్లు వేశాడ‌ని సీనియ‌ర్లు విడ‌మ‌రిచి చెబుతున్నారు… వ‌ర్మ సెటైర్ల‌కు ప‌వ‌న్ కౌంట‌ర్ ఇస్తాడో లేక సైలెంట్ అయిపోతాడో వేచిచూడాలి. మ‌రి ప‌వ‌న్ ఫ్యాన్స్ వ‌ర్మ‌కు ఎలా కౌంట‌ర్ ఇస్తారో చూడాలి.

Loading...

Leave a Reply

*