మోడీని చూడాలి.. మాట్లాడాలి… రాహుల్ ప‌ల‌వ‌రింత‌

modi-and-rahul

ప్ర‌ధాని మోడీపై ఎప్పుడూ నిప్పులు చెరిగే రాహుల్ ఇప్పుడు భిన్నంగా స్పందించారు. మోడీతో మాట్లాడాల‌ని ఉంద‌ని అన్నారు. బుధ‌వారం అర్ధ‌రాత్రి దాటాక మ‌న సైన్యం చేసిన దాడులతో దేశంలో రాజ‌కీయ స‌మైక్య‌త వెల్లివిరిసింది. ఉప్పు నిప్పులా ఉండే ప‌క్షాలు కూడా ఇప్పుడు ఆత్మీయంగా ప‌ల‌క‌రించుకుంటున్నాయి. అంద‌రూ క‌లిసి మోడీనీ, బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఆకాశానికెత్తేస్తున్నాయి. నిత్యం మోడీపై విమ‌ర్శ‌ల దాడి చేసే కాంగ్రెస్ పార్టీ కూడా ఉగ్ర‌వాదుల‌పై సైనిక చ‌ర్య విష‌యంలో మాత్రం మోడీకే జై కొట్టింది.

ఆ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల‌గాంధీ మ‌రో అడుగు ముందుకేసి ప్ర‌ధానిని క‌లిసి మాట్లాడాల‌ని ఉంద‌ని కూడా వ్యాఖ్యానించారు. ప్ర‌ధాని అయిన రెండున్న‌రేళ్ల కాలంలో మోడీ చేసిన ఒకే ఒక్క గొప్ప ప‌ని ఇదేన‌ని అందుకే ఆయ‌న‌ను క‌లిసి మాట్లాడాల‌నుకుంటున్నాన‌ని రాహుల్ చెప్పారు. ఈ విష‌యంలో మోడీ ప్ర‌భుత్వం చేప‌ట్టే ప్ర‌తి చ‌ర్యకూ మ‌ద్ద‌తిస్తామ‌ని రాహుల్ ప్ర‌క‌టించారు. రాజ‌కీయాల‌లో ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధి రాహుల్ కూడా పొగిడేస‌రికి ఇప్పుడు క‌మ‌ల‌నాథులు సంతోషంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నారు.

Loading...

Leave a Reply

*