అవినీతిరాయుళ్ల‌పై మోదీ సూప‌ర్‌పంచ్‌… రేపు ఎల్లుండి ఏటీఎమ్‌లు బంద్‌…!

modi

మెదీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. దేశంలో విచ్చ‌ల‌విడిగా పెరిగిపోతున్న న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్ట‌డానికి ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం న‌ల్ల‌కుబేరుల గుండెల్లో ద‌డ పుట్టిస్తోంది. జాతిని ఉద్దేశించి ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌.. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. అవినీతిని అరిక‌ట్ట‌డంలో మోదీ తీసుకున్న నిర్ణ‌యం.. ఓ విప్ల‌వాత్మ‌క ముందడుగుగా భావిస్తున్నారు. స‌డెన్‌గా టీవీ స్క్రీన్‌ల‌పై ప్ర‌త్య‌క్ష‌మైన ప్ర‌ధాన మంత్రి.. అవినీతి నిర్మూల‌న‌కు ఆయ‌న తీసుకుంటున్న చ‌ర్య‌లు ఒక్కొక్క‌టి వివ‌రిస్తుంటే.. అది ఒక్కో అణుబాంబుగా మారుతోంది అవినీతి రాయుళ్ల గుండెల్లో. గతంలో ఏ ఒక్క ప్ర‌ధాని తీసుకోన‌టువంటి డేరింగ్‌, డాషింగ్ నిర్ణ‌యాన్ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

బుధ‌వారం, గురువారం.. రెండు రోజుల‌పాటు దేశ వ్యాప్తంగా ఏటీఎమ్‌లు బంద్‌కానున్నాయి. అంతేకాదు, దేశంలో ఇప్ప‌టిదాకా చలామ‌ణిలో ఉన్న రూ. 1000, రూ. 500నోట్ల‌ను నిషేధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. డిసెంబ‌ర్ 31లోగా అంద‌రి ద‌గ్గ‌ర ఉన్న నోట్లను బ్యాంక్‌ల‌లో కానీ, సంబంధిత అధికారుల ద‌గ్గ‌ర కానీ డిపాజిట్ చెయ్యాల‌ని పిలుపునిచ్చారు. వాటికి అంతే మొత్తంలో వంద రూపాయ‌ల నోట్లు ఇస్తామ‌ని తెలియ జేశారు. బ్యాంక్‌ల‌లో మ‌ళ్లీ కోటాను కోట్ల రూపాయ‌లు జ‌మ చేద్దామ‌ని ఆలోచించారో.. మీ బొక్క పలిగిన‌ట్లే. దానికి ఐడీ కార్డ్ జ‌మ‌చెయ్యాలి. అంటే.. నిబంధ‌న‌లు ఎంత క‌ఠిన‌త‌రం చేశారో ఆలోచించుకోవ‌చ్చు.

అంతేకాదు, ఏటీఎమ్‌లలో ఇక‌నుంచి రోజుకి 10వేలకి మించి విత్ డ్రా చెయ్య‌కూడ‌దు. వారానికి 20వేల రూపాయ‌లు మాత్ర‌మే విత్ డ్రా చెయ్యాలి. ఇలా, ఎటునుంచి చూసినా.. ఒక్క రెండు రోజుల గ్యాప్‌లోనే మోదీ.. అవినీతి రాయుళ్ల చుట్టూ ఉచ్చు బిగించారు. వారి పాలిట య‌మ‌దూత‌గా మారారు.

Loading...

Leave a Reply

*