చిరంజీవి నిజాయితీప‌రుడు… ప‌వ‌న్ సంగ‌తే…

chiru-and-pawan

పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి నిజాయితీప‌రుడ‌ని ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణ‌ముర‌ళి వ్యాఖ్యానించారు. జ‌న‌సేన అధినేత, చిరంజీవి త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి మాత్రం తాను మాట్లాడ‌న‌ని చెప్పారు. ఒక టీవీ ఇంట‌ర్వ్యూలో పోసాని ఈ వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి స్పందించాలంటూ అడిగిన ప్ర‌శ్న‌కు తాను నిజ‌య‌తీప‌రుల గురించి… చెడ్డ వ్య‌క్తిత్వం ఉన్న వాళ్ల గురించే మాట్లాడుతాన‌ని న‌ర్మ‌గ‌ర్బంగా వ్యాఖ్యానించారు.

నా మ‌న‌స్త‌త్వం న‌చ్చి చిరంజీవి ఎన్నిక‌ల‌లో పోటీ చేసే అవ‌కాశం ఇచ్చార‌ని ఆయ‌న చాలా నిజాయితీ ప‌రుడ‌ని నా ద‌గ్గ‌ర‌నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేద‌ని అన్నారు. ఇక‌, ప‌వ‌న్ స్థాపించిన జ‌న‌సేన గురించి మాట్లాడుతూ.. ఆ పార్టీ ఏమిటో త‌న‌కేమీ అర్థం కావ‌డం లేద‌ని అర్థ‌మైన త‌ర్వాత స్పందిస్తే బావుంటుంద‌ని చెప్పారు. చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని మ‌ళ్లీ ప్రారంభిస్తే ఆయ‌న వెంట న‌డిచేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని తెలిపారు.

Loading...

Leave a Reply

*