పోసాని వెర్సెస్ వి హెచ్ .. లైవ్ ఫైట్..!

posani-and-v-h

ఈ మధ్య టీవీ లైవ్ షోస్ ఫైటింగ్స్ కి కేరాఫ్ గా మారుతున్నాయి.. వాదన నెగ్గడమే లక్ష్యం గా చాలామంది పార్టిసిపెంట్స్ భావిస్తుండటమే ఇందుకు కారణం. ఇవాళ రాత్రి టీవీ 5 లో జరిగిన ఒక లైవ్ డిస్కషన్ లో సినీ నటుడు రచయిత పొలసాని కృష్ణ మురళి.. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు ల మధ్య మాటలు ముదిరి చేతల వరకు వచ్చింది. దీంతో లైవ్ లో ఏం జరుగుతుందో చాలాసేపటి వరకు అర్థం కాలేదు. కానీ ఈ ఫైట్ ఏకంగా మాటలు దాటి చేతల వరకు రావడం తో .. నిర్వాహకులు ఇద్దరినీ కంట్రోల్ చేసి పోసాని ని బయటకు తీసుకువెళ్లి.. కొంత బ్రేక్ తర్వాత మల్లి లైవ్ డిస్కషన్ కంటిన్యూ చేసారు..

మరి ఇంత ఫైట్ జరగడానికి కారణం.. సరిహద్దుల్లో సైన్యం చేపట్టిన సర్జికల్ strikes విషయం లో కావడం విశేషం . సర్జికల్ స్ట్రిక్స్ కు సంబంధించిన వీడియోస్ ను బయట పెట్టాలని వి హెచ్ డిమాండ్ చేయగా ఇలా అడగడం అనైతికం అంటూ తనదైన స్టయిల్లో కౌంటర్ ఇస్తూ కాస్త మాటలు తూలాడని ప్రత్యక్ష సాక్షుల కథనం. అంత‌లో డిస్క‌ష‌న్ క‌వ‌ర్ చేస్తున్న కెమెరామెన్ స‌మ‌య స్పూర్తిగా కెమెరాని ప‌క్క‌కి తిప్పారు. ఇటు, సీపీఐ నారాయ‌ణ కూడా వారికి స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, ఎక్క‌డా త‌గ్గ‌లేదు. లైవ్‌లోనే డిష్యుం డిష్యుంకి పోటీలు ప‌డ్డారు. కుర్చీల‌లో నుంచి లేచి కొట్టుకోవ‌డానికి రెడీ అయ్యారు. ఏదేమైనా సున్నితమైన విషయాల పై నిర్వహించే డిస్కషన్స్ పట్ల నిర్వాహకులు కూడా కాస్త సంయమనం ఉన్న గెస్ట్ లను పిలిస్తే బావుండేది. ఈ వీడియో లింక్ ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి..

Loading...

Leave a Reply

*