భూమాకు రూట్ క్లియ‌ర్ చేస్తున్న ప్ర‌భుత్వం!

bhuma-nagireddy

వైసీపీ నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వుల ఇచ్చే విష‌యంలో ప్ర‌భుత్వం చ‌ర్య‌లు ప్రారంభించిన‌ట్లు తెలిసిందే. ద‌స‌రాకు జ‌రిగే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో వైసీపీ నుంచి వ‌చ్చిన ముగ్గురు ఎమ్మెల్యేల‌కు మంత్రిప‌ద‌వులిచ్చేందుకు చంద్ర‌బాబు సంసిద్ధ‌త వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. దీనిపై ఇప్ప‌టికే ఆయా నేత‌ల‌కు స‌మాచారం కూడా ఇచ్చిన‌ట్లు తెలిసిందే. ఇక్క‌డే క‌ర్నూలు జిల్లాకు సంబంధించి టీడీపీలోకి వ‌చ్చిన భూమా నాగిరె్డ్డికి కూడా మంత్రిప‌ద‌వి ఖాయ‌మ‌ని వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే, వైసీపీలో ఉండ‌గా జరిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల భూమా నాగిరెడ్డిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. పోలీసులు.

అప్ప‌ట్లో ఆయ‌న జైలుకు కూడా వెళ్లి వ‌చ్చారు. ఇప్పుడు భూమా ప‌ద‌వికి అదే అడ్డంకిగా మారిన‌ట్లు స‌మాచారం. అందుకే త‌గిన విధంగా ఆయ‌న‌కు క్లీయ‌రెన్స్ ఇచ్చేలా రౌడీ షీట్‌ను ఎత్తివేసేందుకు చ‌ర్య‌లు మొద‌లైన‌ట్లు తెలిసింది. రౌడీషీట్ ఉండ‌గానే మంత్రిని చేస్తే ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది కాబ‌ట్టి దాన్ని తొల‌గించేందుకు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై భూమా కూడా దృష్టి పెట్టార‌ని తెలిసింది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే పోలీసులు ఒక నివేదిక‌ను సిద్ధం చేశార‌ని దానిపై జిల్లా ఎస్పీ నిర్ణ‌యం తీసుకుంటే భూమాపై రౌడీషీట్ ఎత్తివేత ఆదేశాలు వ‌స్తాయ‌ని స‌మాచారం.

Loading...

Leave a Reply

*