జ‌నం ప‌వ‌న్ వ‌ద్ద‌కు… జ‌గ‌న్ జ‌నం వ‌ద్ద‌కు

jagan-and-pawan

రాష్ట్రంలో జ‌గ‌న్ ప‌రిస్థితి విచిత్రంగా త‌యారైంది. ఏపీలో టీడీపీ అధికార‌ప‌క్షం కాగా, వైసీపీ ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్షం. ప్ర‌భుత్వంతో ఇబ్బంది త‌లెత్తిన‌ప్పుడు జ‌నం స‌హ‌జంగా ప్ర‌తిప‌క్ష పార్టీల వెంట శ‌ర‌ణ‌కోరుతారు. అయితే, ఏపీలో మాత్రం త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకునేందుకు జ‌నం జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్ల‌డం లేదు. ఉన్నాడో లేదో తెలియ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ద్ద‌కు వెళ్తున్నారు. జ‌నం ఎటూ త‌న వ‌ద్ద‌కు రావ‌డం లేదు కాబ‌ట్టి జ‌గ‌నే హైద‌రాబాద్ నుంచి ఏపీలోని జనం వ‌ద్ద‌కు రావాల్సి వ‌స్తోంది. బీమ‌వ‌రం ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటుపై ఆందోళ‌న చేస్తున్న అక్క‌డి జ‌నం హైద‌ర‌బాద్ వెళ్లి మ‌రీ ప‌వ‌న్ ముందు త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకొన్నారు. దాంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా తీవ్రంగా స్పందించారు. ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోకుంటే జ‌నం ఇబ్బందుల‌కు ప‌ట్టించుకోకుంటే తాను రంగంలోకి దిగాల్సి వ‌స్తుంద‌ని హెచ్చిరించారు.

ఆ వెంట‌నే స్పందించిన సీఎం చంద్ర‌బాబు ఫుడ్ పార్క్ స‌మ‌స్య‌పై క‌మిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. క‌లెక్ట‌రు, ఎమ్మెల్యేల‌తోనూ అప్ప‌టిక‌ప్పుడే స‌మీక్ష కూడా నిర్వ‌హించారు. అంతా అయిపోయిన త‌ర్వాత క‌ళ్లు తెరిచిన జ‌గ‌న్ ఇప్పుడు బీమ‌వ‌రంలో ప‌ర్య‌టిస్తున్నారు. హైద‌ర‌బాద్ నుంచి నేరుగా బాధిత గ్రామాల‌కు వెళ్లిన జ‌గ‌న్ అక్క‌డి జ‌నం బాధ‌లు వినేందుకు ప్ర‌త‌యత్నిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే… ప‌వ‌న్ ముందు.. . జ‌గ‌న్ ఆ వెనుక అన్న‌ట్లుగా ప‌రిస్థితి త‌యారైంద‌ని చ‌ర్చించుకుంటున్నారు.

Loading...

Leave a Reply

*