ప‌వ‌న్ టార్గెట్ చంద్ర‌బాబే?

pawan-kalyan

ప్ర‌త్యామ్న‌య రాజ‌కీయ‌మంటూ అప్పుడ‌ప్పుడూ రాష్ట్ర రాజ‌కీయ తెర‌పై ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ప్ర‌జ‌లు భారీ ఆశ‌లే పెట్టుకున్న‌ట్లున్నారు. ప్ర‌త్యేక హోదాపై మొన్న‌మ‌ధ్య ఓ రెండు స‌భ‌లు నిర్వ‌హించి త‌న మానాన తాను సినిమాలు చేసుకుంటున్నాడు. రాజ‌కీయ నేత‌లెవ‌రైనా స‌మ‌స్య‌లు ఎక్క‌డుంటే అక్క‌డ వాలిపోయి అక్క‌డ ప్ర‌జ‌ల‌కు మ‌ద్ద‌తుగా నిలిచి రాజ‌కీయంగా బ‌ల‌ప‌డాల‌ని చూస్తారు. అయితే, ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యంలో మాత్రం ఇది రివ‌ర్స్‌లో జ‌రుగుతోంది. జ‌న‌మే త‌మ బాధ‌లు ప‌ట్టించుకోవాలంటూ ఆయ‌న్ని వెతుక్కుంటూ హైద‌రాబాద్ వ‌చ్చేస్తున్నారు. అలా కోర‌డంతోనే గ‌తంలో ఓసారి రాజ‌ధాని రైతుల విష‌యంలో ప‌వ‌న్ రాష్ట్ర ప్ర‌భుత్వంతో త‌ల‌ప‌డ్డారు. అప్పుడు మిత్ర‌ప‌క్షంగా ఉన్నారు కాబ‌ట్టి చంద్ర‌బాబుకు విష‌యం అర్థ‌మ‌య్యేలా చెప్పి ఒప్పించారు. కానీ ఇప్పుడు ప‌వ‌న్ రాష్ట్ర‌ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

తాజాగా ప‌శ్చ‌మ‌గోదావ‌రి జిల్లా బీమ‌వ‌రం స‌మీపంలో నిర్మిస్తున్న ఆక్వాఫుడ్ పార్క్‌ను వ్య‌తిరేకిస్తూ అక్క‌డి జ‌నం హైదరాబాద్ వ‌చ్చి మ‌రీ ప‌వ‌న్‌ను క‌లిసింది. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ నేరుగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం విమ‌ర్శ‌ల‌కు దిగిన‌ట్లు వార్త‌లొచ్చాయి. పారిశ్రామికాభివృద్ధికి జ‌న‌సేన పెద్ద‌పీట వేస్తుంద‌ని చెప్పిన ప‌వ‌న్‌… కానీ అభివృద్ధి పేరుతో ప్ర‌జ‌లు భ‌యంతో బ‌తికే ప‌రిస్థితిని తీసుకురావ‌ద్ద‌ని చుర‌క‌లంటించారు. ఫుడ్ పార్కు విష‌య‌మై ప్ర‌భుత్వంతో మాట్లాడి ఇబ్బంది లేకుండా ప‌రిష్క‌రిస్తాన‌ని ప‌వ‌న్ వారికి హామీ ఇచ్చి పంపిన‌ట్లు తెలిసింది. ఒక‌వైపు రాష్ట్రానికి పెట్టుబ‌డులు సేక‌రించే ప‌నిలో బాబు బిజీగా ఉంటే ప‌వ‌న్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి వ‌ర‌కూ టీడీపీ నేత‌ల‌ను తిట్టినా చంద్ర‌బాబును మాత్రం ప‌వ‌న్ ప‌ల్లెత్తు మాట అన‌లేదు. చంద్ర‌బాబు కూడ ప‌వ‌న్‌ను వెన‌కేసుకొస్తునే ఉన్నారు. మ‌రి ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి.

Loading...

Leave a Reply

*