చిరూ చేసిన త‌ప్పు చేయొద్ద‌నేనా?

chiru

సినిమాల్లో మెగాస్టార్‌గా వెలుగొందుతున్న చిరంజీవి రాజ‌కీయాల్లో మాత్రం అనుకున్న‌ది సాధించ‌లేక‌పోయారు. ఇప్పుడు ఆయ‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాన్ అదే బాట‌లో రాజ‌కీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. అయితే, రాజ‌కీయాల్లో అన్న చేసిన పొర‌పాట్లు తాను చేయ్య‌రాద‌ని ప‌వ‌న్ గ‌ట్టిగానే నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. భారీ అభిమానులు, రాష్ట్ర‌మంతా చిరంజీవి నామ‌స్మ‌ర‌ణ జ‌రుగుతున్న రోజుల్లో మెగ‌స్టార్ రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేశారు. దాన్ని జీర్ణించుకోలేని కొంద‌రు ప్ర‌త్య‌ర్థులు ఆయ‌న‌పై విమ‌ర్శ‌ల బాణాలు సంధించడం మొద‌లుపెట్టారు. ఇందులో ప్ర‌ధాన‌మైన విమ‌ర్శ చిరంజీవి ఇంత పెద్ద న‌టుడై ఉండి కూడా త‌న సొంత ప్రాంతానికి ఏమీ చేయ‌లేద‌న్న‌ది.

పుట్టిన ఊరికే ఏమీ చేయ‌లేని చిరంజీవి రాష్ట్రానికి ఏం చేస్తారంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీనికి చిరంజీవి స్వ‌యంకృతం కూడా ఉంది. తాను పుట్టిన ఊరిని నిజంగానే ఆయ‌న పూర్తిగా మ‌ర్చిపోయారు. ఎప్పుడూ కూడా త‌న సొంత ఊరిప‌ట్ల మ‌మ‌కారం చూపించ‌లేక‌పోయారు. దాంతో విప‌క్షాలు చేసిన ప్ర‌చారం ప్ర‌జ‌ల్లోకి బ‌లంగానే వెళ్లింది. ఇక‌, ఇప్పుడు అన్న బాట‌లోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్ మాత్రం ఆ పొర‌పాటు చేయ‌కుండా ముందుగానే జాగ్ర‌త్త‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే త‌న సొంత ఊరికి దగ్గ‌ర‌గా ఉండేలా ఆయ‌న త‌న మ‌కాంను ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు మార్చాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఓటు హక్కును కూడా అక్క‌డికే మార్పించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. త‌ద్వారా ప్ర‌త్య‌ర్థులు చిరంజీవిపై చేసిన విమ‌ర్శ‌లు త‌న‌పై రాకుండా ముందు జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు.

చిరంజీవి చేసిన‌ట్లుగానే తిరుప‌తిలో స‌భ పెట్టి రాజ‌కీయ క్రీయాశీల‌ను ప్ర‌క‌టించిన ప‌వ‌ర్‌స్టార్‌ సోంత ఊరి విష‌యంలో మాత్రం అన్న‌య్య‌కు భిన్నంగా న‌డుచుకుంటున్నార‌ని దీన్ని బ‌ట్టి తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని ఆయ‌న అభిమానులు కూడా పేర్కొంటున్నారు. చిరంజీవికి, ప‌వ‌న్‌కు ఉన్న తేడా అదేన‌ని ప‌వ‌న్ అభిమానులు చెబుతున్నారు.

Loading...

Leave a Reply

*