ఏపీలోనే ప‌వ‌న్ మ‌కాం… అక్క‌డే ఓటు

pawan

జ‌న‌సేన అధినే ప‌వ‌న్ క‌ల్యాన్ ఇక ఏపీకి అంకితం కానున్నారు. హైద‌రాబాద్‌లో ఉన్న త‌న ఓటు హ‌క్కును ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మార్పించుకోనున్నారు. అంటే ఇక‌పై ఏపీ రాజ‌కాయాలను ప‌వ‌న్ సీరియ‌స్‌గానే తీసుకుంటున్నార‌న్న‌మాట‌. ప‌శ్చిమ‌గోదావ‌రికి చెందిన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, ప‌వ‌ర్ స్టార్ అభిమానులు పెద్ద సంఖ్య‌లో హైద‌రాబాద్ వ‌చ్చి వ‌ప‌న్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారు చేసిన విజ్ఞ‌ప్తి ఒక్క‌టే. మీరు ఇక‌పై ఏలూరును మీ ఇలాకాగా మార్చుకోండి అని. అంతే ప‌వ‌న్ కూడా దానికి అంగీక‌రించేశారు.

ఏలూరులో తాను ఉండేందుకు వీలైన ఒక ఇంటిని చూడాల‌ని వారికి సూచించారు. అలాగే, త‌న ఓటు హ‌క్కును హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ నుంచి ఏలూరుకు మార్చే ప్ర‌క్రియ‌ను ప్రారంభించాల‌ని త‌న పార్టీ యంత్రాంగాన్ని ఆదేశించారు. తాము అడ‌గ్గానే ఏలూరుకు వచ్చేస్తాన‌ని ప‌వ‌న్ హామీ ఇవ్వడంతో హైద‌రాబాద్ వ‌చ్చిన ఆయ‌న అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Loading...

Leave a Reply

*