మెగా ఫ్యామిలీలో మోడీ చిచ్చు రగులుకుంది…!

untitled-15-copy

మెగాస్టార్ బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య మోడీ చిచ్చు మొద‌లైంది. కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యునిగా ఉన్న చిరంజీవి త‌మ్ముళ్లు ఒక‌రు మోడీకి వ్య‌తిరేకంగా మ‌రోక‌రు మోడీకి మ‌ద్ద‌తుదారుగా మారిపోయారు. నోట్ల ర‌ద్దు వ్యవ‌హారంపై వీరిద్ద‌రూ విభిన్న‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంవ‌మైంది. అయితే, ఇందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎటూ మొద‌టి నుంచి చిరంజీవికి రాజ‌కీయంగా దూరంగా ఉంటూ సొంత కుంప‌టి జ‌న‌సేన పార్టీని పెట్టుకున్నారు. కాబ‌ట్టి ఆయ‌న మోడీకి వ్య‌తిరేకంగా మాట్లాడారంటే అర్థం ఉంది. అయితే, చిరంజీవి అంటే ప్రాణ‌మిచ్చే నాగ‌బాబు ఇప్పుడు మోడీ భ‌క్తుడైపోవ‌డం విస్మ‌యం గొలుపుతోంది. పైగా తాను కాంగ్రెస్ స‌భ్యుడినేన‌ని అయినంత మాత్రాన కాంగ్రెస్‌కే మ‌ద్ద‌తు ప‌ల‌కాలాంటే కుద‌ర‌ద‌ని మంచి ప‌నులు చేసేట‌ప్పుడు మోడీ అయితేనేం ఎవ‌రైతేనేం వాటిని నేను స‌మ‌ర్థిస్తాన‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు.

చిరంజీవి ఇప్ప‌టికీ కాంగ్రెస్ ఎంపీగానే ఉన్నారు. నోట్ల ర‌ద్దు విష‌యంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీపై, మోడీపై ఎడ‌తెగ‌ని పోరాటం చేస్తుంది. ఈ క్ర‌మంలో చిరంజీవి సోదరుడు నాగ‌బాబు కాంగ్రెస్‌ను కాద‌ని మోడీకి జై కొట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త‌న 150వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న చిరంజీవి ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ నోట్ల ర‌ద్దుపై స్పందించ‌లేదు. ఇప్పుడు నాగ‌బాబు స్పందించ‌డంతో చిరంజీవి మాట జ‌వ‌దాట‌ని త‌మ్ముడిగా ఆయ‌న మాట‌ను మెగా ఫ్యాన్స్ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే అవ‌కాశం ఉంది. చిరంజీవి వ‌చ్చి త‌న వైఖ‌రి వెల్ల‌డించే వ‌ర‌కూ చిరంజీవి కూడా నోట్ల ర‌ద్దు విష‌యంలో మోడీకి జై కొడుతున్నారేమోన‌ని ఆయ‌న అభిమానులు భావించే అవ‌కాశం ఉంది.

రాజ‌కీయ అంశాలు ప‌క్క‌న‌పెడితే… టాలీవుడ్‌లో నోట్ల ర‌ద్దు ఎలాంటి ప‌రిణామాలు సంభ‌వించ‌బోతున్నాయ‌న్న దానిపై స్పందిస్తూ.. నీతి నిజాయితి తో డబ్బులు సంపాదించిన వారికి ఏ కష్టాలు రావని ..కోట్లు కోట్లు తీసుకుంటూ ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టిన వారికీ నష్టం తప్పదని అలాంటోళ్లే ఇబ్బందులు ప‌డుతున్నార‌ని అన్నారు. ఈ వ్యాఖ్యాలు టాలీవుడ్‌లోని అంద‌రితో పాటు త‌న ఇంటికి చెందిన హీరోల‌కూ వ‌ర్తిస్తాయా అంటూ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో సెటైర్లు మొద‌ల‌య్యాయి.

Loading...

Leave a Reply

*