2019 ఎన్నిక‌ల‌లో పోటీకి జ‌న‌సేన రెడీ… ఎమ్మెల్యేగా పోటీ చేస్తా..!

pawan

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక్కో మీటింగ్‌కి ఒక్కో అంశంసై స్ప‌ష్ట‌త ఇస్తున్నాడు. నిన్న‌మొన్న‌టిదాకా ఆయ‌న ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌పై సైలెంట్‌గా ఉన్నారు. గ‌త ఎన్నిక‌లలో ప‌వ‌న్ టీడీపీ, బీజేపీకి మ‌ద్ద‌తు ప‌ల‌క‌డ‌మే కానీ, పోటీ చెయ్య‌లేదు. కానీ, 2019 ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అనంత‌పురంలో నిర్వ‌హించిన జ‌న‌సేన స‌భ‌లో ఆయ‌న ఉద్వేగంగా ప్ర‌సంగించారు.

హైద‌రాబాద్ త‌ర్వాత జ‌న‌సేన ఆఫీస్‌ని అనంత‌పురంలో ప్రారంభిస్తాన‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అనంత‌పురంలోనే ఎందుకు అనే దానికి ఆయన వివ‌ర‌ణ కూడా ఇచ్చారు. క‌రువు జిల్లా కాబ‌ట్టి.. ఇక్క‌డి నుంచే తన పోరాటం ప్రారంభమ‌వుతుంద‌ని వివ‌రించారు. అక్క‌డి ప్ర‌జ‌లు అండ‌గా ఉన్నా.. లేకున్నా.. తాను మాత్రం వారి స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌తాన‌ని తెలిపారు.

2019లో ప‌వ‌న్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని అనౌన్స్ చేశారు. ఇటీవ‌లే ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ఓటు హ‌క్కును హైద‌రాబాద్ నుంచి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకి బదిలీ చేయించే ఏర్పాట్లు చూడాల‌ని పార్టీని ఆదేశించారు. తాజాగా ఇక రాబోయే ఎన్నిక‌ల‌లోనూ పోటీకి సిద్ధం అని ప్ర‌క‌టించారు. ఆ దిశ‌గానే ఆయ‌న అడుగులు వేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. అందుకే, యువ‌త‌ను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగాలు చేస్తున్నారు. ఇటు, రైతు స‌మ‌స్య‌ల‌పైనా ఎజెండా ప్ర‌క‌టిస్తున్నారు. తాను కూడా రైతునే అని ప్ర‌తి మీటింగ్‌లోనూ చెబుతున్నారు. మొత్త‌మ్మీద‌, ప‌వ‌న్ అన్ని వ‌ర్గాల‌నూ ఆక‌ర్షించి త‌న‌కంటూ సొంత ఓటు బ్యాంక్‌ని ఏర్పాటు చేసుకోవ‌డానికి ఆయన ప్ర‌య‌త్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప‌వ‌న్ ప్ర‌సంగాలు మ‌రింత వేడెక్కే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

Loading...

Leave a Reply

*