స‌ర్జ‌రీ త‌ర్వాత కోమాలోనే పాకిస్థాన్‌!

pakistan

భార‌త్ సైన్యం చేసిన మేజ‌ర్ స‌ర్జ‌రీ నుంచి పాక్ కోలుకోవ‌డం లేదు. ఉరీ దాడి త‌ర్వాత ర‌గిలిపోయిన భార‌త్ ప్ర‌జానీకానికి ఆర్మీ దాడులు ఆనందాన్ని, పెద్ద ఊర‌ట‌ను క‌లిగించాయి. అదే స‌మ‌యంలో పాకిస్థాన్‌ను అయోమ‌యం అనే కోమాలోకి నెట్టేశాయి. భార‌త్ చేసిన దాడుల‌ను ఖండిస్తే…. అంత‌ర్జాతీ స‌మాజం ముందు త‌లొంచుకోవాల్సి వ‌స్తుంది. వాటిని ఖండించ‌క‌పోతే సొంత పౌరుల ముందు ప‌లుచ‌న అయిపోవాల్సిన ప‌రిస్థితి. దాంతో దాడులు జ‌రిగాయ‌ని చెప్ప‌లేక‌… జ‌ర‌గ‌లేద‌ని బుకాయించ‌లేక డైలామాలో ప‌డిపోయారు అక్క‌డి నేత‌లు. దాడులు జ‌రిగి నాలుగు రోజుల‌వుతున్నా పాక్ ప్ర‌భుత్వంలో అదే ప‌రిస్థితి.

భార‌త ర‌క్ష‌ణ మంత్రి పారిక‌ర్ చెప్పిన‌ట్లు మ‌న ఆర్మీ చేసిన మేజ‌ర్ స‌ర్జ‌రీతో పాకిస్థాన్ కోమాలోకి వెళ్లింద‌ని, ఇప్ప‌ట్లో ఆ కోమా నుంచి బ‌య‌ట‌ప‌డే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌న్న‌ది వాస్త‌వ‌మేన‌నిపిస్తోంది. ఇప్పుడు భార‌త్‌పై ఎవ‌రికి ఫిర్యాదు చేద్దామ‌న్న ఎక్క‌డ త‌లుపులు తెరుచుకోవ‌డం లేదు. ఐక్య‌రాజ్య స‌మితి కూడా పాక్ ఆరోప‌ణ‌లను లైట్ తీసుకుంది. అమెరికా భార‌త్‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతోంది. త‌మ తొడుంటుంద‌నుకున్న చైనా కూడా ఇప్పుడు గోడ‌మీద పిల్లివాటం ప్ర‌ద‌ర్శిస్తుంది. ఇక‌, ఇప్పుడు పాక్‌కు మిగిలిన ఒకే ఒక నేస్తం ఉగ్ర‌వాదులే. వారినే ఉసిగొల్పి భార‌త్ మీద ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని పాక్ త‌ల‌పోస్తోంది. కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అది అసాధ్యం.

Loading...

Leave a Reply

*