క‌ళ త‌ప్ప‌నున్న వైభోగం.. టాలీవుడ్ నుంచి గాలి కూతురి పెళ్లికి ఆ ఇద్ద‌రే వెళ్తార‌ట‌…!

untitled-20

గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కూతురి పెళ్లి.. నిన్న‌మొన్న‌టిదాకా బాగా హైలైట్ అయిన న్యూస్‌. స‌డెన్‌గా మోదీ ప్ర‌క‌టించిన బ్లాక్ మ‌నీ స‌ర్జిక‌ల్ స్ట్రయిక్స్‌తో హెడ్‌లైన్స్‌లో ఉన్న ఆ మేట‌ర్‌.. బ్యాక్ బెంచ్‌కి వెళ్లింది. దీంతో, నిన్న‌మొన్న‌టిదాకా గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి కూతురు మ్యారేజ్‌కి టోట‌ల్ టాలీవుడ్ మొత్తం త‌ర‌లివెళుతుంద‌ని భావించగా.. తాజాగా కేవ‌లం ఇద్ద‌రు మాత్ర‌మే వెళ‌తార‌నే టాక్ వినిపిస్తోంది.

ఆ ఇద్ద‌రు ఎవ‌రో కాదు.. ఒక‌రు బ్ర‌హ్మానందం, మ‌రొక‌రు.. ఆలీ. తెలుగు సినిమా కామెడీకి గత కొంత‌కాలంగా వీరే కేరాఫ్. కూతురి మ్యారేజ్‌కి గాలి జనార్ధ‌న్ రెడ్డి టాలీవుడ్‌లోని ప‌లువురు ప్ర‌ముఖుల‌కు ఇన్‌విటేష‌న్‌లు పంపాడు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోల‌యిన చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ వంటి వారికి ఆయ‌నే స్వ‌యంగా కార్డ్‌ల‌ను కూడా ఇచ్చి వ‌చ్చాడు. గిఫ్ట్‌ని ఇచ్చి వివాహానికి సాద‌రంగా ఆహ్వానించాడు. దాస‌రి నారాయ‌ణరావుతో పాటు మ‌రికొంద‌రు బ‌డా నిర్మాతలను ఆయ‌న కూడా పిలిచారు. ప్ర‌భాస్ వంటి కొంద‌రు క‌థానాయ‌కులకు కూడా గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి ఇన్విటేష‌న్‌లు ఇచ్చార‌ని స‌మాచారం. దీంతో ఆయ‌న గారాల ప‌ట్టి, ఒక్క‌గానొక్క కూతురి మ్యారేజ్ అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతుంద‌ని భావించాడ‌ట జ‌నార్ద‌న్ రెడ్డి. కానీ, చివ‌ర‌కి బ్ర‌హ్మానందం, ఆలీ మాత్ర‌మే పెళ్లికి హాజ‌రు కానున్న‌ట్లు తెలుస్తోంది.

వీరిని కూడా డైలాగ్ కింగ్ సాయికుమార్ తీసుకుపోతున్న‌ట్లు స‌మాచారం. గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కూతురి మ్యారేజ్‌కి మొద‌టినుంచి స‌మ‌న్వ‌యక‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు సాయికుమార్‌. ఆయనే సెల‌బ్రిటీలు అంద‌రినీ ఆహ్వానిస్తున్నారట‌. మోదీ ప్ర‌క‌ట‌న త‌ర్వాత రేగిన ర‌గ‌డ‌తో ప‌లువురు హీరోలు, హీరోయిన్‌లు వెన‌క‌డుగు వేస్తున్నార‌ట‌. మ‌రి, చివ‌రికి బ్ర‌హ్మానందం, ఆలీ అయినా హాజ‌ర‌వుతారా? హ్యాండ్ ఇస్తారా? అనేది చూడాలి.

Loading...

Leave a Reply

*