ట్రంప్‌పై మరో షాకింగ్ వాస్త‌వం బ‌య‌ట‌ప‌డింది…!

untitled-21

డొనాల్డ్ ట్రంప్‌.. అమెరికా అధ్య‌క్ష భ‌వ‌నంలో అడుగుపెట్ట‌డానికి రెడీ అవుతున్న విజేత‌. ఆయ‌న గురించి ఇప్ప‌టిదాకా నెగిటివ్ అంశాలే ఎక్కువ‌గా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. పాజిటివ్‌గా ఉన్నవి త‌క్కువ‌గా తెలిశాయి. ఈ ఎన్నిక‌ల‌లో మీడియా అంతా ట్రంప్‌కి వ్య‌తిరేకంగా ప‌ని చెయ్య‌డ‌మే. ఎవ‌రు ఏమ‌నుకున్నా.. ఎవ‌రు ఔనన్నా.. ఎవ‌రు కాదన్నా.. ఆయ‌న కాబోయే అమెరికా అధ్య‌క్షుడు. దీంతో, ట్రంప్‌కి సంబంధించిన అన్ని అంశాలూ వెలుగులోకి వ‌స్తున్నాయి.

ముఖ్యంగా ట్రంప్ వ్య‌క్తిగ‌త జీవితంపై అనేక విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ఆయ‌న మహా మొండివాడు. ఈ విష‌యం ఎన్నిక‌ల స‌మ‌యంలోనే అంద‌రికీ అర్ధం అయింది. పార్టీలో ఏ ఒక్క‌రూ స‌పోర్ట్ చెయ్య‌క‌పోయినా.. ఎంత‌మంది నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చినా ట్రంప్ విజేత‌గా నిలిచాడు. ఇక చిన్న వ‌య‌సులోనూ ట్రంప్ తండ్రి వ్యాపారాల‌ను త‌న భుజానికెత్తుకున్నాడు. దానిని స‌మర్ధ‌వంతంగా నిర్వ‌హించి మ‌ల్టీ బిలియ‌నీర్‌గా అవ‌త‌రించాడు.

ట్రంప్‌పై మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం రివీల్ అయింది. అదేంటంటే.. ఆయన మంచి న‌టుడు కూడా. ప‌లు హాలీవుడ్ సీరియ‌ల్స్‌లో టెలిఫిల్మ్స్‌లో న‌టించాడు. అన్ని సీరియ‌ల్స్‌లోనూ ఆయ‌న దాదాపు బిజినెస్ మేన్ గా..రిచ్ ఫాద‌ర్‌గా న‌టించాడు. 14 టీవీ షోల్లో, 12 సినిమాల్లో నటించారు. మొట్టమొదటిసారి ది జెఫర్ సన్స్ అనే టీవీ షోలో 1985లో నటించిన ట్రంప్.. సినిమాల్లోకి మాత్రం 1989లో గోస్ట్ కాంట్ డు ఇట్ అనే చిత్రం ద్వారా అడుగుపెట్టారు.

2010లో వచ్చిన వాల్ స్ట్రీట్:మనీ నెవర్ స్లీప్స్ అనే చిత్రంలో ట్రంప్ నటించినప్పటికీ థియేటర్ వర్షన్ లో ఆయన నటించిన విభాగాన్ని తొలగించారు. డీవీడిలో మాత్రం అలాగే ఉంచారు. సినిమాల్లో నటనపై ఆసక్తి కనబరిచిన ట్రంప్ తన నటనను మాత్రం వృద్ధి చేసుకోలేకపోయారని.. ప్రేక్షకులను మెప్పించలేకపోయారని పలు మేగిజిన్లు వెల్లడించాయి. ఒక చిత్రంలో ట్రంప్ మాంత్రికుడిగా కూడా నటించాడు. అయినా, ట్రంప్ కు ఒక్క అవార్డుగానీ, గుర్తింపుగానీ రాకపోవడం విశేషం.

Loading...

Leave a Reply

*