ఎన్టీఆర్ తెలంగాణ ఓటరా..?ఏపీ ఓటరా..?

jr-ntr

నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ బిడ్డగా మిగిలి పోనున్నారా. ఏపీలో ఇప్పుడిదే చర్చ జరుగుతుంది. వుమ్మడి ఏపీలో జరిగిన చివరి ఎన్నికలలో టీడీపీ తరపున జూనియర్ ప్రచారం చేసారు. పార్టీ గెలుపు తన బాధ్యతగా భావించి స్టేట్ అంత సుడిగాలి పర్యటన చేసారు. ఆ ఎన్నికలలో వైఎస్ హవా ఎక్కువగా ఉండడంతో జూనియర్ శ్రమ ఫలించలేదు. ఇక స్టేట్ విడిపోయిన తర్వాత బాబు వారసునిగా లోకేష్ తెరమీదకి రావడంతో ఎన్టీఆర్ టీడీపీ కి దూరం అయ్యారు. జూనియర్ పొలిటికల్ లైఫిని వదులుకోవడానికి వేరే కారణాలు కూడా వున్నాయనుకోండి.

ఇక ఎప్పటి విషయానికి వస్తే ఏపీలో రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకున్న పవన్ కళ్యాణ్ తన వోట్ హక్కును ఏపీకి మార్చుకుంటున్నారు. ఏపీలో ఒక ఇల్లు కూడా తీసుకుని ఉండాలి అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంకా ఏపీకి మకాం మార్చే హీరోలు ఎవరు అన్న చర్చ వచ్చినపుడు జూనియర్ పేరు తెరమీదకి వచ్చింది. పవన్ మాదిరే ఎన్టీఆర్ కూడా ఏపీకి మకాం మారుస్తాడా లేక తెలంగాణలోనే అంటే హైదరాబాద్ లోనే వుంటారా అన్న చర్చ జోరుగా సాగుతుంది. టీడీపీ కి చెందిన బాబు ఫామిలీ లోకేష్ సహా అందరు ఏపీకి మకాం మార్చేశారు. ఐతే ఏపీకి మారె విశేషయంలో జూనియర్ మాత్రం ఇప్పటి వరకు నోరు విప్పలేదు.

తాత ఎన్టీఆర్ పోలికలతో పుట్టిన జూనియర్ తాత పొలిటికల్ వారసత్వాన్ని కొనసాగించాలి అంటే ఏపీకి మకాం మార్చాల్సిందే. మరి ఎన్టీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో మరి.

Loading...

Leave a Reply

*