ఎన్టీఆర్ కి గుడి కట్టాలని….

sr-ntr

ఆయన నందమూరి తారక రామారావుకి వీరాభిమాని. గుండెల నిండా ఉన్న అభిమానాన్ని తన ఊరిలో ప్రతిష్టించాలి అనుకున్నాడు. ఆ నవరస నట వభౌముడికి ఆలయం కట్టి కొలవాలనుకున్నాడు. ఐతే తాను చూస్తే కాదు పేదరికంలో వున్నాడు. చిన్న బడ్డీ కొట్టు నడుపుతూ అందులో వచ్చే నాలుగు రూపాయలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఐనా సరే గుడి కట్టి తీరాల్సిందే అనుకున్నాడు. చిత్తూర్ జిల్లా కంచనపల్లె గ్రామానికి చెందిన పెనుమచ్చ శ్రీనివాసులు, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు వీరాభిమాని. వృద్ధాప్యంలో తనకు వచ్చే పింఛను డబ్బు, కొంతమంది దాతల సాయంతో కంచనపల్లెలో చిన్న ఆలయాన్ని నిర్మించాడు.

అందులో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ప్రతి ష్ఠించి నిత్యపూజలు జరిపించాలనే నిశ్చయంతో ఉన్నాడు. అందుకు తగిన ఆర్ధిక స్థోమత లేకపోవడంతో చిన్నపాటి చిల్లర అంగడి నిర్వహిస్తూ దానిపై వచ్చే ఆదాయాన్ని కూడా ఆలయ నిర్మాణానికి వెచ్చిస్తున్నాడు. మరికొందరు పెద్ద మనసుతో సహకరిస్తే ఇక ఎన్టీఆర్ కి నిత్యా పూజలు మొదలవుతాయి. దాతల కోసం ఎదురు చూస్తూ తానూ కస్టపడి పైసా పైసా కూడబెడుతున్నానని చెబుతున్నాడు శ్రీనివాసులు.

Loading...

Leave a Reply

*