ట్రంపే గెలిచాడు… స్ప‌ష్ట‌మైన మెజార్టీతో నిలిచాడు

untitled-10

అమెరికా కొత్త అధ్య‌క్షుడు ఎవ‌రో తేలిపోయింది. రిప‌బ్లిక‌న్‌ల అభ్య‌ర్థి డోనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌నాత్మ‌క విజ‌యం సాధించారు. వివాద‌స్ప‌ద వ్య‌క్తిగా పేరున్న ట్రంప్‌…. మృధుస్వ‌భావిగా అంద‌రూ ఒప్పుకునే హిల్ల‌రీని ఓడించి శ్వేతసౌదం అదిప‌తిగా నిలిచారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్ప‌ష్ట‌మైన మెజార్టీని ట్రంప్ సాధించారు. ట్రంప్‌కు ఈ ఎన్నిక‌ల‌లో 276 స్థాన‌ల‌ను ట్రంప్ సొంతం చేసుకోగా, హిల్ల‌రీ 218 స్థానాల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో వచ్చే జ‌న‌వ‌రిలో ట్రంప్ వైట్‌హౌస్‌లో అడుగుపెట్ట‌బోతున్నారు. అధ్య‌క్షుడిగా బాథ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైన నాటి నుంచి ట్రంప్ త‌న నోటికి ప‌ని చెప్పారు.

ప్ర‌పంచంలో ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌కుండా అమెరికాకు ఎవ‌రైతే న‌ష్టం చేస్తున్నార‌ని భావించారో వాళ్లంద‌రినీ దునుమాడారు. చీల్చి చెండాడారు. వ్యాపార‌వేత్త‌గా ఉండి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ట్రంప్… వ‌చ్చీ రావ‌డంతో అధ్య‌క్షునిగా పోటీ చేసి ఘ‌న విజ‌యం సాధించారు. అమెరికా 46వ అధ్య‌క్షుడిగా ట్రంప్ వ‌చ్చే ఏడాది ఓబామా నుంచి అధికారాన్ని త‌న సొంతం చేసుకోబోతున్నారు. ఇక‌, ఇప్పుడు ట్రంప్ ఎలా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు అన్న విష‌యం తేలాల్సి ఉంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో తాను చెప్పిన అంశాల‌కు క‌ట్టుబ‌డి ఉంటారో లేకుంటే… అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సంయ‌మ‌నం పాటిస్తారో.. అన్న‌ది మున్ముందు తేలాల్సి ఉంది.

Loading...

Leave a Reply

*