అప్పుడే పాక్ నుంచి దొంగ నోట్లు

untitled-4

భారత్లోకి పాకిస్తాన్ నుంచి దొంగ నోట్ల వరద మొదలయింది . దేశంలో పెద్ద నోట్ల రద్దుపై రెండో కారణం పాకిస్తాన్. పాక్ నుంచి పెద్ద సంఖ్యలో నకిలీ కరెన్సీ వస్తుండటం తెలిసిందే. దాని వల్లే ఉగ్రవాదులు తమ కార్యకలాపాల్ని నిరాటంకంగా చేయగలుగుతున్నారు. వారికీ చెక్ పెట్టడానికే మోడీ ఈ నోట్ల రద్దు అస్త్రాన్ని ప్రయోగించారు. దానితో ఒక్కసారిగా టెర్రరిస్టుల ఆర్ధిక మూలాలు దెబ్బతిన్నాయి. ఐతే ఇంతలోనే తేరుకున్న ఉగ్రవాదులు ఇప్పుడు వంద నోట్ల మీద ద్రుష్టి పెట్టారు.

వంద నోట్లని ఎక్కువగా అచ్చేసి భారత్లోకి పంపాలని నిర్ణయించారు. ఇప్పటికే దేశంలోకి పాక్ నుంచి వంద నోట్ల వరద మొదలైందని నిఘా వర్గాల సమాచారం. వాస్తవానికి మొత్తం భారత్ కరెన్సీలో తక్కువ శాతంగా వున్నా వంద నోట్లలోనే నకిలీ నోట్లు ఎక్కువని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు పెద్ద నోట్ల బదులు వంద నోట్లకి డిమాండ్ పెరగడంతో దాన్ని అవకాశంగా తీసుకుని పాక్ నకిలీ వంద నోట్లని భారీగా వదులుతున్నట్లు సమాచారం.

Loading...

Leave a Reply

*