మ‌ళ్లీ చెలామ‌ణిలోకి ర‌ద్ద‌యిన పెద్ద నోట్లు!

untitled-11-copy

ర‌ద్ద‌యిన పెద్ద నోట్లు మ‌ళ్లీ చలామ‌ణిలోకి వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. మోడీ త‌న నిర్ణ‌యాన్ని పున‌స్స‌మీక్షించుకునే చాన్స్ ఎక్కువ‌గానే ఉంది. ప్ర‌స్తుతం దేశంలోని ప‌రిస్థితి… ఇప్పుడ‌ప్పుడే ఏటీఎంలు ప‌ని చేసే ప‌రిస్థితి లేక‌పోవ‌డం వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని మోడీ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంటార‌ని అధికార వ‌ర్గాల‌లో చ‌ర్చ న‌డుస్తోంది. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు నోట్ల ర‌ద్దును వ్య‌తిరేకిస్తున్నారు.

ప‌న్నెండు రోజులు గ‌డిచిన త‌ర్వాత ప‌రిస్తితిలో ఏ మార్పూ రాలేదు. జ‌నంలో ఆగ్ర‌హం పెరిగిపోతుంది. చివ‌ర‌కు ఇది ఎక్క‌డ‌కు దారి తీస్తుందో అన్న ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సాక్షాత్తూ సుప్రీం కోర్టు కూడా ఇది ఇలాగే కొన‌సాగితే అల్ల‌ర్లు జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించింది. ఈ క్ర‌మంలోనే మోడీ కూడా మ‌రో 50 రోజులు ఈ ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అస‌లు విష‌యం చెప్పేశారు. అంటే మోడీయే 50 రోజులు అన్నారంటే… క‌చ్చితంగా ఆ గ‌డువు ఇంకా ఎక్కువ‌గానే ఉండొచ్చ‌ని తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌జాగ్ర‌హాన్ని చ‌ల్లార్చాలంటే తాత్కాలికంగానైనా నోట్ల ర‌ద్దును వెన‌క్కి తీసుకోవాల‌నే ఆలోచ‌న మోడీలో క‌లుగుతున్న‌ట్లు స‌మాచారం. మ‌రికొన్ని రోజులు అంటే రెండు మూడు వారాలు మ‌ళ్లీ పాత నోట్లను చ‌లామ‌ణిలోకి తెచ్చి.. ఈలోపు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని అప్పుడు పూర్తిగా నోట్లు చెల్ల‌కుండా ర‌ద్దు చేసేలా తన నిర్ణ‌యాన్ని మోడీ పున‌స్స‌మిక్షించుకుంటార‌ని వార్త‌లు వెలువ‌డుతున్నాయి.

Loading...

Leave a Reply

*