ఇక పెట్రోల్ బంకులే బ్యాంకులు.. అక్క‌డ కూడా కొత్త‌ క్యాష్ ఇస్తున్నారు..!

petrol-station

ఇప్ప‌టిదాకా బ్యాంకుల ముందు క్యూలు క‌ట్టిన జ‌న‌మంతా ఇప్పుడు పెట్రోలు బంకుల దారి ప‌ట్టాలి. ఎందుకంటే పాత నోట్లు మార్చుకునే సౌక‌ర్యం ఇక‌పై పెట్రోలు బంకుల్లోనూ అందుబాటులోకి రానుంది. నోట్ల ర‌ద్దుతో దేశ ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. దాంతో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఆ టాస్క్‌ఫోర్స్ రోజూ స‌మావేశ‌మ‌వుతూ ప‌రిస్థితిని స‌మీక్షిస్తోంది. కొన్ని దిద్దుబాటు చ‌ర్య‌లు, కొత్త నిర్ణ‌యాలు తీసుకుంటుంది.

ఈ క్ర‌మంలోనే నోట్ల‌మార్పిడి ప‌రిమితిని త‌గ్గించాల‌ని నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఇదే క్ర‌మంలో ఎస్‌బీఐ ఒక కొత్త నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై డ‌బ్బు డ్రా చేసుకోవాల‌నుకున్న‌వాళ్లంతా బ్యాంకుకే రాన‌క్క‌ర్లేద‌ని, పెట్రోలు బంకుల్లోనూ నోట్లు మార్చుకోవచ్చ‌ని తెలిపింది. దేశంలోని 2500 పెట్రోల బంకుల్లో ఎస్‌బీఐ పీవోఎస్ యంత్రాల‌ను అమ‌ర్చింది. ఆ యంత్రాలున్న పెట్రోలు బంకులకు వెళ్లి జ‌నం తమ డెబిట్ కార్డు ద్వారా డ‌బ్బు డ్రా చేసుకోవ‌చ్చు.

పెట్రోలు బంకుల్లో పెద్ద నోట్లు మార్చుకోవ‌చ్చ‌ని కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్నే పెట్రోలు బంకులు స‌రిగా అమ‌లు చేయ‌లేదు. అన్ని పెట్రోలు బంకుల్లో వంద నోట్ల‌ను బ్లాక్ చేసి వాటితో క‌మిష‌న్ వ్యాపారాలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు కొత్త‌గా ఈ యంత్రాల‌ను పెట్టి కొత్త నోట్ల‌ను వాళ్ల‌కి అప్ప‌గిస్తే… అవి జ‌నానికి చేరుతాయో న‌ల్ల‌ధ‌నం పోగేసుకున్న వాళ్ల‌కు చేర‌తాయో చూడాలి.

Loading...

Leave a Reply

*