ఆ దేశంలో వేల‌కోట్ల‌లో ఇండియ‌న్ క‌రెన్సీ.. ఏం చేయాలంటూ ఆ ప్ర‌ధాని మోదీకి లేఖ‌…!

nepal

గోరు చుట్టుపై రోకలి పోటు…అనే సామెత ఇప్పుడు మన ప్రధాని నరేంద్రమోదీకి కరెక్ట్ గా సరిపోతుంది. విషయం ఏంటంటే..తాజాగా భారత్ కరెన్సీ పాత నోట్లు ఇక చెల్లవు అనే సంచలన నిర్ణయం తీసుకున్న మోదీపై ఇప్పటికే చాలా మంది విమర్శలకు దిగుతున్నారు. కొత్త నోట్ల కోసం దేశవ్యాప్తంగా సామాన్యులు బ్యాంక్‌లు, ఏటీఎమ్‌ల ముందు క్యూలు క‌ట్టారు. ఇప్ప‌టికే దాదాపు క్యూల‌లో నిల‌బ‌డి 30 మంది చ‌నిపోయార‌నే వార్తలు వ‌స్తున్నాయి. కొత్త నోట్లు పూర్తిగా దేశంలో అందుబాటులోకి రావ‌డానికి మినిమమ్ మ‌రో నాలుగ‌యిదు నెల‌లు ప‌డుతుందనే రూమ‌ర్‌లు షికారు చేస్తున్నాయి. ఇలా, ఇంటిపోరుతోనే స‌త‌మ‌త‌మ‌వుతుంటే… తాజాగా మోదీకి మరో షాకింగ్ వార్త అందింది.

నేపాల్ లో భారత కరెన్సీ నోట్లు బాగానే చెల్లుతున్నయనేదే ఆ వార్త లోని సారాంశం. ఇదే విషయాన్ని నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ మోదీకి లేఖ రాశార‌ని తెలుస్తోంది.ఇంతకీ ఆయనేమన్నారంటే..మోదీ గారు మీ 500, 1000 రూపాయ‌ల‌ నోట్లు మా దేశంలో ఎక్కువగా ఉన్నాయి. అవి ఇక్కడ చెల్లుతున్నాయి కూడా. ఇది అంతా పూర్తిగా వైట్ మనీ. అంతా నిరుపేద‌ల ద‌గ్గ‌ర‌, క‌ష్ట‌జీవుల ద‌గ్గ‌ర ఉంది. మ‌రోవైపు, మ‌రో పొరుగుదేశంలా భారత్ కు నేపాల్ కు ఎలాంటి సరిహద్దు సమస్యలు లేవు. ఇమ్మిగ్రేష‌న్ కూడా అంత‌గా అవ‌స‌రం ఉండ‌దు. కావున దేశంలోని పెద్ద నోట్లు అక్క‌డ విప‌రీతంగా స‌ర్క్యులేష‌న్‌లో ఉన్నాయి.

ఇది వేల కోట్ల‌లో ఉండే అవ‌కాశం ఉంది. కావున‌, దీనిని కూడా తీసుకొని కొత్త నోట్ల‌ను ఇవ్వాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశార‌ని స‌మాచారం. లేదంటే, నేపాల్‌లోని వేల మంది రోడ్డున ప‌డ‌తార‌ని ఆయ‌న వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది.ప్రస్తుతం శీతాకాల సమావేశాల్లో బిజీగా ఉన్న మోదీ, కాస్త టైం తీసుకొని నేపాల్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లి వారికి ఊర‌ట క‌లిగించాల‌ని భావిస్తున్నార‌ట‌. లేదంటే, అది ఆ దేశంలో పెద్ద ఎత్తున నిర‌స‌న‌ల‌కు, ఆగ్ర‌హావేశాల‌కు దారి తీస్తుంద‌ని భావిస్తున్నారు. అదే జ‌రిగితే, నేపాల్‌తో మ‌న‌కున్న స‌మ‌స్య‌లు మ‌రింత పెరుగుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు విదేశాంగ నిపుణులు. నిజంగా ఇది మోదీకి అగ్ని పరీక్ష కంటే ఎక్కువనే అనిపిస్తుంది కదా..

Loading...

Leave a Reply

*