న‌యీం దెబ్బ‌కు టీఆర్ఎస్‌లో తొలి వికెట్‌!

nayeem

గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీం దెబ్బ‌కు తెలంగాణ‌లో తొలి వికెట్ ప‌డ‌బోతోంది. న‌యీం అంట‌కాగారంటూ ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన నేత‌ల పేర్లపై ప‌లు క‌థ‌నాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే అనూహ్యంగా న‌యీం మూలంగా ప‌డ‌బొతున్న తొలి దెబ్బకు రాష్ట్రంలోని అధికార‌పార్టీ నేతే బ‌ల‌వుతుండ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. న‌యీంతో అంట‌కాగిన వారిలో అగ్ర‌స్థానంలో ఉన్న శాస‌న‌మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ నేతి విద్యాసాగ‌ర్ రావును ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. ఆయ‌న‌ను డిప్యూటీ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి త‌ప్పించి ఆ స్థానంలో నార‌దాసు ల‌క్ష్మ‌ణ‌రావుకు చాన్స్ ఇవ్వాల‌ని సీఎం భావిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

ఇప్ప‌టికే అవ‌స‌ర‌మైతే ఒక‌రిద్ద‌రు నేత‌ల‌ను వ‌దులుకునేందుకైనా సిద్ధ‌మేన‌ని న‌యీం విష‌యంలో మాత్రం క‌ఠిన చర్య‌లు త‌ప్ప‌వ‌ని కేసీఆర్ ద‌ర్యాప్తు బృందానికి స్ప‌ష్టం చేసిన కేసీఆర్ ఆ మేర‌కు తొలిగా నేతిపై వేటు వేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఆయ‌న స్థానంలో బీజీల‌కే చెందిన టీఆర్ ఎస్ సీనియ‌ర్ నేత నారదాసుకు చాన్స్ ఇస్తే బ్యాలెన్స్ అయిపోతుంద‌న్న‌ది సీఎం యోచ‌న‌. ఈ చ‌ర్య ద్వారా న‌యీం వ్య‌వ‌హారంలో సొంత పార్టీ వారే కాదు ఎంత‌టి వారున్నా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్న సంకేతాలు పంపేందుకు కేసీఆర్ సిద్ధ‌మ‌య్యార‌ని పార్టీ వ‌ర్గాల క‌థ‌నం.

న‌యీం ఆగ‌డాల‌కు చెక్‌పెట్ట‌డంతో ఏ సీఎం చేయ‌లేని ప‌ని చేసి అంద‌రి మ‌న్న‌నలూ పొందిన కేసీఆర్ ఇప్పుడు త‌న పార్టీ నేత‌పైనే చ‌ర్య తీసుకుంటే ఈ విష‌యంలో సీఎంపై ఆరోప‌ణ‌లు చేసేందుకు కూడా ఎవ‌రైనా ఒక‌టికి రెండుసార్లు ఆలోచించాల్సి వ‌స్తుంద‌న్న‌ది సుస్ప‌ష్టం.

Loading...

Leave a Reply

*