నయీం కేసులో వేట మొద‌లైంది!

nayeem

న‌యీం అరాచాకాల‌కు స‌హ‌క‌రించిన వారు మూల్యం చెల్లించే స‌మ‌యం వ‌చ్చేసింది. న‌యీంకు వంత‌పాడి ప్ర‌జ‌ల‌ను వేధించుకుతిన్న వారు ఇప్పుడు ఫ‌లితం అనుభ‌వించ‌బోతున్నారు. ద‌ర్యాప్తును వేగ‌వంతం చేసిన సిట్ బృందం చ‌ర్య‌లు కూడా చేప‌ట్టిన‌ట్లు స‌మాచారం. న‌యీంకు స‌హ‌క‌రించిన అత‌డికి అండ‌గా నిలిచిన పోలీసులు, పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌పై వేటు మొద‌లైన‌ట్లే ఉంది. బ‌య‌ట‌కు తెలియ‌కుండా చాప‌కింద నీరులా న‌యీం డైరీలోని అభియోగాలు ఎదుర్కొంటున్న పోలీసుల‌ను ఇప్ప‌టికే ప‌క్క‌న పెడుతున్న‌ట్లు తెలిసింది. వారి స‌ర్వీసు రివాల్వ‌ర్ల‌ను కూడా స‌రెండ‌ర్ చేయాల‌ని ఉన్న‌తాధికారులు ఆదేశించిన‌ట్లు వార్త‌లొచ్చాయి.

అలా ఆయుధాలు అప్ప‌గించాల్సిందిగా ఆదేశాలు అందుకున్న వారిలో ఎస్ఐ నుంచి సీఐ, డీఎస్సీ, ఏఎస్పీ వ‌ర‌కూ ప‌లు హోదాల‌లో ఉన్న అధికారులున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. వీరిలో చాలామంది ద‌గ్గ‌ర నుంచి స‌ర్వీసు రివాల్వ‌ర్లు స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిసింది. ఇక‌, రాజ‌కీయాంగా టీఆర్ఎస్ పార్టీ నుంచే న‌యీంకు స‌హ‌క‌రించిన వారిపై చ‌ర్య‌లు మొద‌లు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో న‌ల్గొండ టీఆర్ ఎస్ నేత వ్య‌క్తిగ‌త ఆయుధ లైసెన్సును ర‌ద్దు చేసిన‌ట్లు తెలిసింది. అయితే, దీన్ని అధికారికంగా ఇంకా ఎవ‌రూ ద్రువీక‌రించ‌డం లేదు. అలాగే, ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న చాలామంది నేత‌ల గ‌న్‌మెన్‌ను త‌గ్గించిన‌ట్లు తెలిసింది.

Loading...

Leave a Reply

*