న‌యీం వెనుక దావూద్ గ్యాంగ్‌!

nayeem

నాలుగు జిల్లాల్లో  అరాచ‌కాలు చేసిన న‌యీంకు దావూద్ ఇబ్ర‌హీం గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయా? న‌యీం కేసు ద‌ర్యాప్తు చేస్తున్న సిట్ బృందానికి ఇదే అనుమానం వ‌చ్చింది. న‌యీం త‌న నేర సామ్రాజ్యంలో వినియోగిస్తున్న అత్యాధునిక ఆయుధాలు ఎక్క‌డి నుంచి సేక‌రించార‌న్న‌దానిపై సిట్ పోలీసులు దృష్టి పెట్టారు. న‌యీం హ‌త‌మైన త‌ర్వాత అత‌నికి సంబంధించి దాఖ‌లైన కేసుల‌లో అత్య‌ధికం ఆయుధాల‌కు సంబంధించిన‌వే కావ‌డం గ‌మ‌నార్హం. న‌యీం మృత‌దేహం వ‌ద్ద ఒక ఏకే47 గ‌న్ ల‌భ్యం కాగా, అత‌ని డెన్‌లు, ఇళ్ల‌లోనూ పెద్ద సంఖ్య‌లో ఈ త‌ర‌హా తుపాకులు, ఇత‌ర ఆయుధాలు, పేలుడు ప‌దార్థాలు పోలీసుల‌కు దొరికాయి.ఒక మామూలు గ్యాంగ్‌స్ట‌ర్‌కు ఇంత‌పెద్ద ఎత్తున అధునాతన ఆయుధాలు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయో అర్థం కాక పోలీసులే విస్మ‌యానికి గుర‌య్యారు.

దానిపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టిన పోలీసుల విచార‌ణ‌లో దిగ్ర్భాంతిగొలిపే వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. న‌యీంకు ముంబైలోని దావూద్ ఇబ్ర‌హీం గ్యాంగ్‌లు స‌హ‌క‌రించిన‌ట్లు కొన్ని ఆధారాలు ల‌భ్య‌మ‌య్యాయి. నయీం అనుచరుడు ఫయాజుద్దీనను విచారించిన‌ప్పుడు మత్తుపదార్ధాలను కొనుగోలు చేసి మహ్మద్‌ అబ్దుల్‌ ఫహీం, తోట కుమారస్వామి అలియాస్‌ టెక్‌ మధుకు అందజేసినట్లు తేలింది.దీంతో ఫహీం, టెక్‌ మధును సిట్ పోలీసులు త‌మ అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించింది. అక్రమ ఆయుధాలు, మత్తుపదార్ధాలతోపాటు చత్తీస్‌గఢ్‌లో గ్యాంగ్ అరాచ‌కాల‌పై స‌మాచారం పోలీసుల‌కు దొరికింది. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌లో ఎవరెవరు మత్తుపదార్ధాలను వినియోగించారు? ఎవరికైనా విక్రయించారా? అనే కోణంలోనూ సిట్‌ దర్యాప్తు చేస్తోంది.

Loading...

Leave a Reply

*