ఆర్కే క్షేమం…. ఉత్కంఠకి తెర

naxliet-rk

ఏఓబీ ఎంకౌంటర్ తర్వాత ఏర్పడిన ఉత్కంఠకి తె ర పడింది. ఆ ఎంకౌంటర్లో 31 మంది మావోయిస్ట్స్ ప్రాణాలు కోల్పోయారు. చాలామంది జాడ తెలియకుండా పోయింది. వీళ్ళలో ముఖ్యంగా మావోయిస్టు అగ్ర నేత ఆర్కే ఏమైనారన్నది తెలియకపోవడం తీవ్ర ఉత్కంఠకి కారణమైంది. గాయపడ్డారని కొందరు పోలీసులే పట్టుకెళ్లారని మరికొందరు… ఇలా ఎవరికి తోచినట్లు వారు వూహించుకోవడంతో ఆ ఉత్కంఠ మరింతగా పెరిగింది. ఈ క్రమంలోనే ఆర్కే భార్య శిరీష హై కోర్ట్ కి వెళ్లడంతో ఆర్కే ఆచూకీపై పరిణామాలు వేడి పుట్టించాయి. ఐతే అనూహ్యంగా ఆర్కే క్షేమంగా ఉన్నారన్న సమాచారం గురువారానికి మావోయిస్టు పార్టీ కి చేరింది.

దానితో మావోయిస్టు నేతలు ప్రజా సంఘాల నేతలు ఊపిరి పీల్చుకున్నారు. విరసం నేత వరవరరావు ఆర్కే క్షేమ సమాచారాన్ని బయటకి చెప్పారు. దీనితో మొదటి నుంచి పోలీసులు చెబుతున్నట్లు ఆర్కే వారి అదుపులో లేదన్న విషయం నిజమైంది.

Loading...

Leave a Reply

*