పెద్ద నోట్ల ర‌ద్దుతో మోదీకి 3-5ల‌క్ష‌ల కోట్లు లాభం అంట‌.. నిజ‌మేనా..?

modi

500, 100 నోట్ల రూపాయ‌ల‌తో మోదీ స‌ర్కార్‌కి భారీగా లాభం ఉందా..? అందులోనూ ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు ఆదాయం స‌మ‌కూర‌నుందా..? అంటే, అవున‌నే అంటున్నారు ఆర్ధికవేత్త‌లు. ఇదెలా అంటే.. దానికి ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు చెబుతున్నారు.ఒక అంచ‌నా ప్ర‌కారం దేశంలో ప్ర‌స్తుతం 17ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల క‌రెన్సీ ఉంది. అందులో పెద్ద నోట్లు 85 శాతం వ‌ర‌కు ఉంటుంద‌ట‌. అంటే, 14 ల‌క్ష‌లు పెద్ద నోట్లు కాగా, 100 నోట్ల రూపాయ‌ల శాతం కేవ‌లం 3ల‌క్ష‌ల రూపాయ‌లేన‌ట‌. సుమారు 14ల‌క్ష‌ల రూపాయ‌ల నోట్లు మ‌ళ్లీ కేంద్ర ప్ర‌భుత్వం అకౌంట్‌లోకి రావాలి. అన్ని బ్యాంకుల నుంచి జ‌మ అయిన త‌ర్వాత అదే స్థాయిలో కొత్త నోట్లు మార్కెట్‌లోకి వ‌స్తుంది. కానీ, అవినీతి ప‌రుల నుంచి ఆ స్థాయిలో నిధులు బ్యాంక్ అకౌంట్‌లోకి రావ‌ని చెబుతున్నారు.

ఇందులో గ‌ట్టిగా బ్యాంక్ అకౌంట్‌లోకి వ‌స్తే 10 నుంచి 11 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కే చేరుతుంద‌ని ఆర్ధిక వేత్త‌లు భావిస్తున్నారు. అంత‌కంటే ఎక్కువ మ‌నీ ఖాతాల‌లో జ‌మ అయ్యే అవ‌కాశం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. చాలా మంది అవినీతి ప‌రులు త‌మ క‌రెన్సీని మార్చుకోవ‌డానికి త‌లెత్తే ఇబ్బందులతో అవి ఆగిపోయే చాన్స్ ఉందంటున్నారు. సో.. బ్యాంక్‌ల నుంచి 10ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే కొత్త‌ క‌రెన్సీ ఎక్చేంజ్ అయింద‌ని అనుకుందాం. అంటే, మార్కెట్‌లో 14ల‌క్ష‌ల కోట్ల‌కు బ‌దులు… 10ల‌క్ష‌ల కోట్లు మాత్ర‌మే ల‌భిస్తుంది. మరి, మిగిలిన 4ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల క‌రెన్సీ ఏమ‌యినట్లు..? ఆ ర‌కంగా అది తీవ్ర ఆర్ధిక సంక్షోభానికి తెర‌దీసే చాన్స్ ఉంది.

ఇక్క‌డే మోదీ స‌ర్కార్‌కి ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ఆదాయం స‌మ‌కూర‌నుంద‌ట‌. ఎలా అంటే.. ఆ 4ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ధనాన్ని.. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం ప్రింట్ చేసి మార్కెట్‌లోకి తెస్తుంది. దానిని ఆర్‌బీఐ ఎప్ప‌టిక‌ప్పుడు నిధుల‌ను అందుబాటులోకి తెస్తుంది. ఇలా మిగిలిన 4ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఉప‌యోగించుకునే అవకాశం ఉంటుందంటున్నారు ఆర్థిక నిపుణులు. దీంతో, కేంద్ర ప్ర‌భుత్వం దానిని వివిధ ఆర్ధిక కార్య‌క‌లాపాల‌కు, అభివృద్ధి ప‌నుల‌కు వాడుకోవ‌చ్చట‌. అంటే, మోదీ స‌ర్కార్‌కు ఈ లెక్క ప్ర‌కారం 3-5 ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కు ఆదాయం స‌మ‌కూరుతుంద‌ని లెక్క‌లు కడుతున్నారు. దీనిని అంద‌రూ అంగీక‌రిస్తున్నారు. ఎందుకంటే రోడ్ల‌మీద, డ్రైనేజ్‌ల‌లో ప‌డే నోట్లు కాకుండా లెక్క‌లు చూపించ‌కుండా మురిగిపోయే మ‌నీ భారీగా ఉండ‌నుంది. మోదీ దెబ్బ అదిరింది క‌దూ. అందుకే, రిస్క్ అయినా ఈ మొత్తం వ్య‌వ‌హారానికి మోదీ తెర‌దీశార‌ట‌.

Loading...

Leave a Reply

*