అంబానీకి మోడీ 22 వేల కోట్ల ఆఫ‌ర్‌

modi

భార‌తీయ దిగ్గ‌జ పారిశ్రామిక‌వేత్త అంబానీకి మోడీ భారీ ఆఫ‌ర్ ఇచ్చారు. ర‌క్ష‌ణ రంగంలోకి వారికి స్వాగతం ప‌లికారు. రాఫెల్ య‌ద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఒక సంయుక్త సంస్థ ఏర్పడింది. ఇందులో యుద్ధ విమానాలు త‌యారు చేసే ద‌సాల్ట్ ఏవియేష‌న్ సంస్థ‌తో అనిల్ అంబానీకి చెందిన రిల‌య‌న్ప్ గ్రూప్ ఒక ఒప్పందం చేసుకుంది. ఈ మొత్తం ఒప్పందం విలువ 22 వేల కోట్లు. ఇప్ప‌టి వ‌ర‌కూ గుజ‌రాత్‌కు చెందిన అదానీ గ్రూప్ మాత్ర‌మే మోడీతో స‌న్నిహితంగా ఉంటుంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. మోడీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అదాని గ్రూప్‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ల‌భిస్తుంద‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ కూడా మోడీ దేశం కోసం కాకుండా…

త‌న మిత్రులైన కొంద‌రు భారీ స్థాయి పారిశ్రామిక‌వేత్త‌ల కోస‌మే ప‌ని చేస్తున్నార‌ని ఆరోపిస్తోంది. ఇక‌, పారిశ్రామిక రంగంలో మ‌రో దిగ్గ సంస్థ టాటా గ్రూప్ కూడా ప్ర‌భుత్వంతో క‌లిసి న‌డుస్తోంది. ఆ గ్రూప్కు మొన్న‌టి వ‌ర‌కూ చైర్మ‌న్‌గా ఉన్న‌ ర‌త‌న్ టాటా ప్ర‌భుత్వ స‌లహాదారుగా విశిష్ట సేవ‌లందిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు అంబానీలు కూడా ప్ర‌భుత్వంతో క‌లిసి న‌డిచేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. మోడీ కూడా పారిశ్రామిక‌వేత్త‌ల‌ను ద‌గ్గ‌ర చేసుకునేందుకు య‌త్నిస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. మొన్న‌నే మేక్ ఇన్ ఇండియాకు తాము తెస్తున్న జీయో సంచ‌ల‌నం కూడా తోడ్పాటునిస్తుంద‌ని ముకేశ్ అంబానీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అనిల్ అంబానీ ఏకంగా యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని సొంతం చేసుకుని ర‌క్ష‌ణ రంగంలోనే పాగా వేస్తున్నారు.

Loading...

Leave a Reply

*