రాజుగారూ బాబు ఏమంటున్నారు… మోడీ ఆరా!

chandra-babu

నోట్ల ర‌ద్దుపై చంద్ర‌బాబు వైఖ‌రి తెలుసుకునేందుకు ప్ర‌ధాని మోడీ ప్రయ‌త్నించారు. నోట్ల ర‌ద్దుపై దేశంలోని ప‌లువురు ముఖ్య‌మంత్రులు మోడీకి వ్య‌తిరేకంగా జ‌ట్టు క‌ట్టి ఆందోళ‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌న మిత్రులు వైఖ‌రి తెలుసుకునేందుకు మోడీ య‌త్నిస్తున్నారు. బుధ‌వారం లోక్‌స‌భ‌లో విప‌క్ష నేత‌లంద‌రిని ప‌ల‌క‌రిస్తున్న సంద‌ర్భంలో మోడీ… కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు ప్ర‌ధానికి ఎదుర‌య్యారు. దాంతో ఏం రాజుగారూ…. బాబు ఏమంటున్నారు.. ఏపీలో ప‌రిస్థితి ఏమిటి అని ఆరా తీశార‌ట‌. దానికి స్పందించిన అశోక్ గ‌జ‌ప‌తి రాజు… బాబు వైఖ‌రిని వెల్ల‌డించారు.

వాస్త‌వానికి మోడీ నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌క‌ముందే… చంద్ర‌బాబు ప‌లుమార్లు పెద్ద నోట్లు ర‌ద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఏకంగా ప్ర‌ధానికి లేఖ‌లే రాశారు. వెయ్యి, ఐదొంద‌లు నోట్ల వ‌ల్ల బ్లాక్ మ‌నీ పెరిగిపోతుంద‌ని, వాటిని ర‌ద్దు చేస్తే న‌ల్ల డ‌బ్బుకు చెక్ ఫెట్ట‌వ‌చ్చ‌ని బాబు కోరుతూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే అనూహ్యంగా బాబు కోరిన‌ట్లే మోడీ నిర్ణ‌యం తీసుకున్నారు. దాంతో ఇదంతా త‌మ ఘ‌న‌తేన‌ని చంద్ర‌బాబు, టీడీపీ నేత‌లు ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ప్ర‌ధాని కూడా బాబు ఏమంటున్నార‌ని ఆరా తీయడం విశేషం.

Loading...

Leave a Reply

*