ప్ర‌జ‌ల‌పై మోడీ మ‌రో బాంబు

untitled-16

నోట్ల ర‌ద్దుతో దేశ ప్ర‌జ‌ల‌ను బ్యాంకుల ముందు నిలెబెట్టిన మోడీ మ‌రో బాంబు పేల్చారు. ఇప్ప‌టి వ‌ర‌కూ న‌గ‌దు మార్పిడి కింద ఇస్తున్న నాలుగున్న‌ర వేల మొత్తాన్ని రెండు వేల‌కు కుదిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నిర్ణ‌యం రేప‌టి(శుక్ర‌వారం) నుంచి అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు. క‌రెన్సీ కొర‌త నేప‌థ్యంలో లిమిట్ త‌గ్గించ‌క త‌ప్ప‌డం లేద‌ని ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి శక్తికాంత్ దాస్ తెలిపారు. అయితే, ఈ కొత్త నిబంధ‌న నోట్ల మార్పిడికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని, త‌మ ఖాతాల నుంచి న‌గ‌దును విత్‌డ్రా చేసుకునే వారికి వ‌ర్తించ‌ద‌ని ఆయ‌న చెప్పారు. ఇక‌, పెళ్లిళ్లు చేసుకునే వారికి స్వ‌ల్స ఊర‌ట క‌ల్పించారు.

పెళ్లిళ్లు జ‌రిగే ఇంటిలో ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని వ‌ధువు, వ‌రుడు త‌ల్లిదండ్రుల ఖాతాల‌లో లిమిట్ లేకుండా విత్ డ్రా చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు చెప్పారు. ఇక‌, రైతుల‌కు కూడా ఊర‌ట క‌ల్పించే నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఇక‌పై వారు వారానికి పాతిక వేల వ‌ర‌కూ విత్ డ్రా చేసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని దాస్ వెల్ల‌డించారు. ఇప్పుడిస్తున్ నాలుగున్న‌ర వేల రూపాయ‌లే చాల‌క జ‌నం ఇబ్బందులు ప‌డుతుంటే.. దాన్ని రెండు వేల‌కు కుదించ‌డం మ‌రింత ఇబ్బందిక‌ర‌మే. ఇప్పటికే డ‌బ్బు తీసుకునే వారికి సిరా గుర్తు వేస్తున్న సంగ‌తి తెలిసిందే.

Loading...

Leave a Reply

*