టీడీపీని మోడీ ఇలా దెబ్బ‌కొడుతున్నారా?

mcha

ఏపీలో మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీకి మోడీ ప్ర‌భుత్వం చుక్క‌లు చూపిస్తున్న‌ట్లే ఉంది. కేంద్రం హోదాపై మాట త‌ప్పినా ప్యాకేజీతో స‌రిపెట్టినా చేసేదేం లేక చంద్ర‌బాబు కేంద్రం చెప్పిన‌దానికి త‌లూపారు. రాష్ట్ర అవ‌స‌రాల రీత్యా కేంద్రంలోని బీజేపీతో తంపులు పెట్టుకోవ‌ద్ద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వారు అడిగిన ప‌ద‌వులు ఇస్తూ.. రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాలు ఇస్తూ బీజేపీకి రాష్ట్రంలో ఇతోధికంగా సాయ‌ప‌డుతున్నారు. ఏమీలేని ఏపీలో ఒక అడ్ర‌స్‌ను బీజేపీకి చంద్ర‌బాబు ఇస్తున్నారు. అయితే, కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం మాత్రం చంద్ర‌బాబుకు క‌ష్టాలే తెచ్చిపెడుతోంది. తాజాగా న‌ల్ల‌ధ‌నం వెలికితీత కోసం మోడీ చేప‌ట్టిన కార్య‌క్ర‌మం చివ‌ర‌కు ఏపీలో టీడీపీ నేత‌ల‌కే చుట్టుకుంటోంది. న‌ల్ల‌ధ‌నాన్ని బ‌య‌ట‌కు తెచ్చేందుకు కేంద్రం దేశ ప్ర‌జ‌ల‌కు ఒక అవ‌కాశం ఇచ్చింది. స్వ‌చ్ఛందంగా త‌మ సంప‌ద‌ను వెల్ల‌డించే వారికి కొన్ని రాయితీల‌ను ప్ర‌క‌టించింది.

అలా స్వ‌చ్ఛందంగా ఆదాయ వ్య‌యాల‌ను ప్ర‌క‌టించ‌ని వారిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటామో వెల్ల‌డించేందుకు అప్పుడే దాడులు మొద‌లుపెట్టింది. ఈ దాడులే ఇప్పుడు టీడీపీ నేత‌ల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తున్నాయి. మొన్న‌టికి మొన్న టీడీపీ ఎమ్మెల్యే డీకే స‌త్య‌ప్ర‌భ‌పై ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఇప్పుడు గుంటూరు జిల్లాలోని ఎమ్మెల్యే మోదుగుల‌ వేణుగోపాల్ రెడ్డి ఐటీ అధికారుల టార్గెట్ అయ్యారు. ఆయ‌న ఇళ్ల‌పై ఐటీ దాడులు మొద‌లుపెట్టిన‌ట్లు స‌మాచారం. అయితే, రాష్ట్రంలో ఐటీ అధికారులు చేప‌ట్టాల్సిన దాడుల జాబితా పెద్ద‌గానే ఉంద‌ని స‌మాచారం. అయితే, ముందుగా టీడీపీ ఎమ్మెల్యేల‌నే ఎందుకు టార్గెట్ చేయ‌డం… మిత్ర‌ప‌క్షం అని కూడా చూడ‌కుండా దాడులు చేయిస్తుండ‌డం ఎలా మిత్ర‌ధ‌ర్మ‌మ‌ని టీడీపీ నేత‌లు ధ‌ర్మ సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.

Loading...

Leave a Reply

*