లోకేశ్‌ది కూడా ప‌వ‌నిజ‌మే!

nara-lokesh

రాష్ట్రంలో ఇప్పుడు ప‌వ‌న్‌కు క్రేజ్ అంద‌రికీ తెలిసిందే. సాక్షాత్తూసీఎం చంద్ర‌బాబు కూడా ప‌వ‌న్‌కు అమిత ప్రాధాన్య‌త ఇస్తున్నారు.ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌ను కాద‌ని ప‌వ‌న్‌కే పెద్ద‌పీట వేస్తున్నారు.ప‌వ‌న్ చేస్తున్న డిమాండ్ల‌పై క్ష‌ణాల్లో స్పందిస్తున్నారు. జ‌గ‌న్‌నుప‌క్క‌న‌పెట్టి ప‌వ‌న్‌ను రంగంలోకి తెచ్చి రాష్ట్రంలో జ‌న‌సేన‌ను కీల‌కంచేసేందుకు బాబు ఎత్తులు వేస్తున్నార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.టీడీపీ నేత‌ల‌పై ప‌వ‌న్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తినా చంద్ర‌బాబు మాత్రంసంయ‌మ‌నం పాటించాల‌ని పార్టీ నేత‌ల‌కు సూచిస్తున్నారు. ప‌వ‌న్‌పైప‌ల్లెత్తు మాట అన‌కుండా కాపాడుతున్నారు. ఇక ఇప్పుడు చంద్ర‌బాబు రాజ‌కీయవార‌సుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేశ్‌కూడా అదే బాటప‌ట్టారు. ప‌వ‌న్‌కు విజ‌నుంద‌ని, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపైఆయ‌న‌కో స్ప‌ష్ట‌త ఉంద‌ని లోకేశ్ వ్యాఖ్యానించారు.

రాష్ట్ర అభివృద్ధినిఅడ్డుకునేందుకు తాను సిద్ధంగా లేన‌ని ప‌వ‌న్ చెబుతున్న విష‌యాన్ని అంద‌రూగ‌మ‌నించాల‌ని కూడా లోకేశ్ కోరుతున్నారు. అంటే టీడీపీ అగ్ర‌నాయ‌కత్వం….ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యంలో పూర్తి స్ప‌ష్ట‌త‌తో ఉంద‌న్న విష‌యం దీన్నిబ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. అటుసైడ్ ప‌వ‌న్ కూడా చంద్ర‌బాబును మిన‌హాఅంద‌రిపైనా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఎంపీలపై అయితే మ‌రింత తీవ్రంగామండిప‌డుతున్నారు. ప‌వ‌న్ అంత తీవ్రంగా ధ్వ‌జ‌మెత్తుతున్నా చంద్ర‌బాబు,లోకేశ్‌లు మాత్రం సంయ‌మ‌నం పాటించాలంటూ త‌మ నేత‌ల‌కు చెబుతుండ‌డం,ప‌వ‌న్‌ను శ‌త్రు ప‌క్షంగా కాకుండా మిత్ర‌ప‌క్షంగా భావిస్తుండ‌డం
చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

Loading...

Leave a Reply

*