బాబు ఆస్తులు లెక్క చెప్పిన లోకేశ్‌

nara-lokesh

ఆన‌వాయితీ ప్ర‌కారం చంద్ర‌బాబు ఆస్తులను ఆయ‌న కుమారుడు లోకేశ్ లెక్క చెప్పారు. ప్ర‌తి ఏడాది మాదిరే త‌న తండ్రి, త‌ల్లి, భార్య ఆస్తుల వివ‌రాలు వెల్ల‌డించారు. హెరిటేజ్ కంపెనీ కోసం త‌న త‌ల్లి భువ‌నేశ్వ‌రి, త‌న భార్య బ్ర‌హ్మ‌ణిలు ఎంత‌గా క‌ష్ట‌ప‌డుతుంది కూడా వివ‌రించారు. వారిద్ద‌రూ బిజినెస్ వ్య‌వ‌హారాలు చూసుకోవ‌డంతో తాను, త‌న తండ్రి ఇద్ద‌రం క‌లిసి రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో ప‌య‌నింప‌చేసేందుకు రాజ‌కీయాల‌కు అంకిత‌మ‌య్యామ‌ని చెప్పారు. లోకేశ్ చెప్పిన ప్ర‌కారం ఆయ‌న భార్య బ్ర‌హ్మ‌ణి ఆస్తుల విలువ రూ.12 కో్ట్లు ఉండగా, చంద్రబాబు ఆస్తులు మూడు కోట్లు. త‌న త‌ల్లి భువనేశ్వరి నుంచి త‌న కుమారుడు దేవాన్ష్ కు తొమ్మిది కోట్ల ఆస్తులు బదిలీ అయ్యాయ‌ని, మొత్తం మీద అత‌నికి రూ.11 కోట్ల ఆస్తులు ఉన్న‌ట్లు లోకేశ్ తెలిపారు.

హెరిటేజ్ ఆదాయం వంద వాతం పెరిగి రూ.75 కోట్ల‌కు చేరింద‌ని, అలాగే, త‌న పేరుమీద రు.8 కోట్లకు పైగా ఆస్తి ఉంద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం భువనేశ్వరి ఆస్తుల విలువ ఇరవై నాలుగు కోట్లు అని లోకేశ్ వెల్ల‌డించారు. హెరిటేజ్ లో త‌న పెట్టుబడులు రెండున్నర కోట్లు కాగా, జూబ్లి హిల్స్ ఇంటి విలువ మూడున్నర కోట్ల రూపాయలని తెలిపారు. దేశంలో వరసగా ఆస్తులను ప్రకటించిన కుటుంబం తమదేనని లోకేశ్ ఈ సంద‌ర్భంగా చెప్పారు.

Loading...

Leave a Reply

*