లోకేశ్ బ్యాచ్‌లో స‌త్తా లేదా?

lokesh

ఉమ్మ‌డి రాష్ట్రంలో టీడీపీ కొన్నాళ్లు ప్ర‌తిప‌క్షంలో ఉన్నా… మీడియాలో మాత్రం పెద్ద‌గానే ప్ర‌భావం చూపేది. రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా కూడా టీడీపీ వైఖ‌రిని వెల్ల‌డించ‌డంలో ఆ పార్టీ నేత‌లు మీడియాలో దుందుడుకుగానే ఉన్నారు. విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పార్టీ ప‌గ్గాలు దాదాపుగా లోకేశ్ చేతికొచ్చాయి. చంద్ర‌బాబు సీఎం అయిన త‌ర్వాత ఒక పెద్ద లోపం క‌నిపిస్తోంది. అదే మీడియా చ‌ర్చ‌ల‌లో పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించే వారిలో విష‌యంపై ప‌ట్టు లేక‌పోవ‌డం. గ‌తంలో టీడీపీ త‌ర‌ఫున మీడియా చ‌ర్చ‌ల‌కొచ్చే నేత‌లు పూర్తి స‌మాచారంతో… గ‌ణాంకాల‌తో… అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌తో స‌న్న‌ద్ధ‌మై వ‌చ్చేవారు. వారిలో తెలంగాణ నేత రేవంత్ రెడ్డి, ఆంధ్ర‌కు చెందిన సోమిరెడ్డి ఇలా చాలా మందే ఉండేవారు. అయితే, ఇప్పుడు చ‌ర్చ‌ల‌కొస్తున్న నేత‌లంతో ఉత్త దబాయింపు బ్యాచ్‌గానే మిగిలిపోతున్నారు. అంకెలు, ఆధారాలు ప‌త్రాలు తీసుకుని విష‌యంపై స‌మ‌గ్ర‌మైన అవ‌గాహ‌న పెంచుకుని చ‌ర్చ‌ల‌కు వ‌చ్చే నేత‌లు క‌నిపించడం లేదు.

లోకేశ్ బ్యాచ్‌గా ముద్ర‌ప‌డిన బుద్దా వెంక‌న్న‌, బొండా ఉమా, బాబూ రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇలా టీవీ చ‌ర్చ‌ల‌లో క‌నిపిస్తున్న నేత‌లంతా త‌మ నోటీ బ‌లంతోనే ఆ చ‌ర్చ‌ల‌ను నెట్టుకొస్తున్నార‌న్న ప్ర‌చారం సాగుతోంది. నిన్న జ‌రిగిన శిక్ష‌ణా శిబిరంలో కూడా పార్టీ త‌రఫున టీవీ చ‌ర్చ‌ల‌లో పాల్గొనే నేత‌లంతా పూర్తి స‌మాచారంతో స‌న్న‌ద్ధ‌మ‌వ్వాల‌ని స్వ‌యంగా లోకేశ్ విజ్ఞ‌ప్తి చేయ‌డం తెలిసిందే. అంటే పార్టీ నుంచి చ‌ర్చ‌ల‌లో పాల్గొంటున్న నేత‌ల‌లో విష‌యంపై ప‌క్కాగా వాదించే స‌త్తా ఉండ‌డం లేద‌నేది పార్టీ పెద్ద‌ల అభిప్రాయంగా తెలుస్తోంది.

Loading...

Leave a Reply

*